స్టార్ హీరోలదేముంది వందల కోట్లు సంపాదిస్తారు, లగ్జరిగా ఉంటారని ఏదో అనేసుకుంటాం కానీ వాళ్ళూ సగటు మనుషులేనని గుర్తుకు వచ్చేలా చేసేది వ్యాధులే. ఎంత డబ్బున్నా వాటిని నయం చేసుకోలేని పరిస్థితి తలెత్తవచ్చు. కొన్ని ఎక్కువ సమయం తీసుకుంటాయి. బాలీవుడ్ కండల వీరుడు ప్రస్తుతం ఇదే స్టేజిలో ఉన్నాడు. ప్రాణాంతకం కాదు కానీ తను చెబుతున్న విషయాలు చూస్తే భయం కలగడం ఖాయం. ఇటీవలే ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో స్పెషల్ గెస్టుగా పాల్గొన్న సల్మాన్ తన ఆరోగ్యం గురించి మొదటిసారి సీరియస్ గా వివరించాడు. ఇప్పటిదాకా ఫ్యాన్స్ కు సైతం తెలియని విషయాలను బయటపెట్టాడు.
ముఖంలో వచ్చే తీవ్రమైన నొప్పిని ట్రైజెమినల్ న్యూరల్జియా అంటారు. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా చేసి దెబ్బలు తింటే దీని బారిన పడే ప్రమాదముంది. ఒంట్లో ఉన్న రక్తనాళాలు గడ్డకట్టడం కానీ లేదా ఒక అసాధారణ ఇబ్బంది ఎదురుకొనడం కానీ జరిగితే ఏవి మాల్ఫోర్మేషన్ గా వ్యవహరిస్తారు. శారీకర శ్రమ ఎక్కువైనప్పుడు ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెదడు తరచుగా ఇబ్బంది పెడితే దాన్ని బ్రెయిన్ ఎన్యోరిజమ్ గా వ్యవహరిస్తారు. ఇవన్నీ సల్మాన్ ఖాన్ ఎదురుకుంటున్నాడు. తనను తాను రీ స్టార్ట్ చేసుకోవడానికి ఈ రంగంలో రాణించడానికి ఇలాంటి జబ్బులను దాటుకుంటానని నమ్మకం వ్యక్తం చేశాడు.
గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ ముఖ కావళికల్లో, డైలాగు డెలివరీలో తేడా స్పష్టంగా తెలుస్తోంది. అందరూ మద్యం ఎక్కువగా సేవించడం వల్ల వచ్చిన ఇబ్బందేమో అనుకున్నారు కానీ అసలు కారణాలు బయట పడ్డాయిగా. ఇటీవలే సికందర్ రూపంలో భారీ డిజాస్టర్ అందుకున్న సల్మాన్ ఖాన్ కంబ్యాక్ కోసం అభిమానులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. భజరంగి భాయ్ జాన్, సుల్తాన్, ఏక్ ధా టైగర్ లాంటి బ్లాక్ బస్టర్లు కోరుతున్నారు. షారుఖ్ ఖాన్ బ్యాడ్ ఫామ్ నుంచి వచ్చేయగా సల్మాన్ ఒకడే పెండింగ్ లో ఉన్నాడు. కొత్త సినిమా కోసం కఠిన శిక్షణ, మేకోవర్ చేసుకుంటున్న కండల వీరుడు త్వరలో దాన్ని ప్రకటించబోతున్నాడు.
This post was last modified on June 22, 2025 12:30 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…