నిన్న టాలీవుడ్ జనాలు కుబేర మేనియాలో పడిపోయారు కానీ అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ విడుదలైన విషయం అంతగా నోటీస్ కాలేదు. విచిత్రం ఏంటంటే ఇది తెలుగు డబ్బింగ్ జరిగిన సంగతి కూడా ఆడియన్స్ కు రిజిస్టర్ కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీలు రాకపోగా బిసి సెంటర్స్ లో పలు చోట్ల షోలు క్యాన్సిల్ కావడం లేదా కుబేరకు ఇచ్చేయడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అమీర్ ఖాన్ దేశవ్యాప్తంగా కూడా భారీ నెంబర్లేమీ నమోదు చేయలేదు. డీసెంట్ ఓపెనింగ్స్ దక్కాయి.
ఇక కంటెంట్ విషయానికి వస్తే దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న తీసుకున్న కథ మరీ కొత్తది కాదు. మానసిక దివ్యాంగులకు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాల్సి వచ్చిన గుల్షన్ అరోరా అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. మొదట్లో అతనికి ఇష్టం లేకపోయినా క్రమంగా వాళ్ళతో కలిసిపోయి అందరూ చులకనగా చూసిన ఆ టీమ్ నే ఛాంపియన్స్ గా తయారు చేస్తాడు. దూరమైన భార్యను ఎలా దగ్గర చేసుకున్నాడనే పాయింట్ కూడా దీంతో పాటు జోడించారు. ఎమోషనల్ గా సాలిడ్ కంటెంట్ ఉన్న సితారే జమీన్ పర్ లో ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, అమీర్ ఖాన్ పాత్ర, బాలన్స్ గా కుదిరిన భావోద్వేగాలు దీన్నో డీసెంట్ వాచ్ గా మార్చాయి.
గతంలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో చక్ దే ఇండియా, జెర్సీ, విజిల్, లగాన్ లాంటి సినిమాలు చాలా వచ్చాయి కానీ సితారే జమీన్ పర్ పూర్తిగా నిర్లక్షానికి గురవుతున్న మెంటల్లీ డిజేబుల్డ్ పిల్లల మీద ఫోకస్ చేయడం వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది. అవసరం లేని సన్నివేశాలు, ల్యాగ్ అనిపించే అమీర్ – జెనీలియా ఎపిసోడ్, మోతాదు పెరిగిన డ్రామా లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టినా ఫైనల్ గా నిరాశ పరచకుండా ఓకే అనిపించుకోవడంలో సితారే సక్సెసయ్యింది. కాకపోతే కామన్ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి. చావా, యానిమల్, స్త్రీ 2 స్థాయిలో బాక్సాఫీస్ మేజిక్ చేయడం అనుమానంగానే ఉంది.
This post was last modified on June 21, 2025 12:14 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…