Movie News

టాలీవుడ్ వెయిటింగ్.. శేఖర్ కమ్ముల కొడతాడా?

ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడిపోయేవి. పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతూ.. ప్రతి వారం సందడి నెలకొనేది. కానీ గత కొన్నేళ్ల నుంచి వేసవి వెలవెలబోతోంది. ఈసారి కూడా పరిస్థితి మరీ దారుణం. ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. రిలీజైన వాటిలో కూడా థియేటర్లలో సందడి తీసుకొచ్చినవి తక్కువ. సమ్మర్ వేస్టయినా.. జూన్ నెలలో వారం వారం క్రేజీ సినిమాలు వస్తున్నాయని ప్రేక్షకులు సంబరపడ్డారు. కానీ తొలి వారంలో వచ్చిన ‘థగ్ లైఫ్’ డిజాస్టర్ అయింది. రెండో వారానికి షెడ్యూల్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ వాయిదా పడిపోయింది. దీంతో ఇక మూడో వారానికి షెడ్యూల్ అయిన పెద్ద సినిమా ‘కుబేర’ మీదే అందరి దృష్టీ నిలిచింది.

వెండితెరలో వెలుగులు నింపుతుందని ఈ సినిమా మీద ఇండస్ట్రీ చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడం చిత్ర బృందానికే కాదు.. టాలీవుడ్‌కు కూడా ఎంతో అవసరం.
ఇప్పటిదాకా ఎక్కువగా లవ్ స్టోరీలే డీల్ చేసిన విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల.. రూటు మార్చి ‘కుబేర’ను సీరియస్ సోషల్ డ్రామాగా మలిచాడు. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక.. ఈ కాంబినేషనే చాలా క్యూరియాసిటీని నింపుతోంది. కమ్ముల సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించడం కూడా ఊహించనిదే. నిర్మాతలు కూడా కథ మీద, కాంబినేషన్ మీద నమ్మకంతో ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టేశారు.

సినిమా గురించి ధనుష్, నాగ్ ఒక రేంజిలో చెబుతున్నారు. తన సినిమాల గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకోని కమ్ముల సైతం దీని గురించి మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు. టీజర్, ట్రైలర్ చూస్తే కథేంటన్నది అంతగా అర్థం కాలేదు. హీరోను బిచ్చగాడిగా చూపిస్తూ మెప్పించడం అంటే మాటలు కాదు. మరి ఈ ఛాలెంజ్‌ను శేఖర్ ఎలా అధిగమించడాన్నది ఆసక్తికరం. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఈ సినిమాకు పెద్ద టార్గెట్లే ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే టాక్ అదిరిపోవాలి. మరి శేఖర్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా.. టాలీవుడ్ కోరుకుంటున్న బ్లాక్ ‌బస్టర్‌ను అందిస్తాడా?

This post was last modified on June 20, 2025 7:06 am

Share
Show comments
Published by
Kumar
Tags: Kubera

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

25 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

36 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

1 hour ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

2 hours ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

2 hours ago