Movie News

డాల్బీ అట్మాస్ సౌండులో ‘శివ’ తాండవం

హీరోగా అక్కినేని నాగార్జున కెరీర్ నే కాదు టాలీవుడ్ గమనాన్నే మార్చిన సినిమాగా శివ మూవీ లవర్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్. 1989లో సైలెంట్ సునామిగా విరుచుకుపడి రామ్ గోపాల్ వర్మ అనే దర్శకత్వ సంచలనాన్ని పరిచయం చేసిన ఘనత దీనికే దక్కింది. శివ ఇన్స్ పిరేషన్ ఏ స్థాయి అంటే పూరి జగన్నాధ్, కృష్ణవంశీ లాంటి ఎన్నో బర్నింగ్ టాలెంట్స్ ని పరిశ్రమకు కానుకగా ఇచ్చింది. ఇదంతా జరిగి ముప్పై అయిదు సంవత్సరాలు దాటినా శివ రీ రిలీజ్ డిమాండ్ మాత్రం ఇప్పటిదాకా నెరవేరలేదు. ఫైనల్ గా ఈ ఏడాదిలోనే ఫ్యాన్స్ కోరిక నెరవేరబోతోంది. నాగార్జున స్వయంగా దీనికి సంబంధించిన హామీ ఇచ్చారు.

ఈసారి శివకో ప్రత్యేకత ఉంది. కేవలం రీ మాస్టరింగ్ తో సరిపెట్టడం లేదు. మళ్ళీ కొత్తగా డాల్బీ అట్మోస్ సౌండ్ తో ఫ్రెష్ గా రీ మిక్స్ చేయిస్తున్నారు. అంటే ఇళయరాజా కంపోజ్ చేసిన ఒరిజినల్ బిజిఎంని డిస్ట్రబ్ చేయకుండా మోనోగా ఉన్న సౌండ్ ని స్టీరియో స్పీకర్స్ లో డివైడ్ అయ్యేలా చేస్తారు. దీని వల్ల మాటలకందని కొత్త అనుభూతి దక్కుతుంది. శివ టైంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి, ఆదిత్య 369 లాంటి క్లాసిక్స్ ఇటీవలే రీ రిలీజై క్వాలిటీ పరంగా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వలేకపోయాయి. కానీ శివకు అలా జరిగేలా లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వైనం కనిపిస్తోంది.

శివ కనక వర్కౌట్ అయితే భవిష్యత్తులో మరిన్ని పాత సినిమాలకు మార్గదర్శి అవుతుంది. మంచి నాణ్యతతో అప్పటి క్లాసిక్స్ ని కొత్త జనరేషన్ కు చూపించడం ద్వారా వాటికి శాశ్వతత్వం వచ్చేస్తుంది. ఆ దిశగానే చర్యలు చేపడుతున్నారు. అమల హీరోయిన్ గా నటించిన శివ ద్వారానే చిన్నా లాంటి ఆర్టిస్టులు తెరకు పరిచయమయ్యారు. రఘువరన్ లోని రియల్ విలన్ బయటికి తీసుకొచ్చింది కూడా శివనే. ఆగస్ట్ లో రగడ ఉంది కనక డిసెంబర్ లో శివ రీ రిలీజ్ కు ఛాన్స్ ఉంది. మంచి ప్లానింగ్, ప్రమోషన్స్ చేసుకుంటే కనక శివ ఎక్కువ శాతం ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. నాగార్జున అదే ప్లాన్ లో ఉన్నారట.

This post was last modified on June 19, 2025 6:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

15 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago