దక్షిణాదిన గత రెండు దశాబ్దాల్లో హీరోలుగా పెద్ద రేంజికి ఎదిగిన వాళ్లలో ఉత్తమ నటులెవరో చూస్తే సూర్య టాప్‌లో నిలుస్తాడు. కెరీర్ ఆరంభంలో నటన విషయంలో విమర్శలు ఎదుర్కొన్న సూర్య.. ఆ తర్వాత తనను తాను మలుచుకుని నటుడిగా ఎదిగిన తీరు అసాధారణం. కళ్లతో నటించడం అంటే ఏంటో చెప్పాలంటే సూర్య సినిమాలనే చూపించాలి. ఫిలిం ఇన్‌స్టిట్యూట్లలో సూర్య సినిమాలను ఇందుకోసం పాఠాలుగా పెట్టేయొచ్చు. అంతగా కళ్లతో భావాలు పలికిస్తాడతను.
ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి నటన ఎంత గొప్పగా సాగుతుందో చాలా సినిమాల్లో చూశాం. ఐతే ఇప్పుడు గత పెర్ఫామెన్స్‌లన్నింటినీ దాటేసే స్థాయిలో ‘ఆకాశం నీ హద్దురా’లో అదరగొట్టేశాడు సూర్య. మామూలుగానే సూర్యు ఎమోషనల్ రోల్స్ ఇస్తే చితగ్గొట్టేస్తాడు. ‘ఆకాశం నీ హద్దురా’ పూర్తిగా ఎమోషన్లతో ముడిపడ్డ సినిమా కావడం.. తన సత్తా చూపించే సన్నివేశాలు ఇందులో చాలా పడటంతో సూర్య విజృంభించేశాడు.
సామాన్యుల కోసం సరసమైన ధరల్లో టికెట్ల రేట్లు పెట్టి విమానం నడిపించాలని ఒక సామాన్యుడు పడే తపన నేపథ్యంలో సాగే సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. హీరోలో ఈ ఆలోచన రావడానికి దారి తీసే సన్నివేశంలో ప్రతి ఒక్కరి హృదయాలను తడుతుంది. చావు బతుకుల్లో ఉన్న తండ్రిని అత్యవసరంగా వెళ్లి చూద్దామంటే విమానం టిక్కెట్టు కొనడానికి డబ్బులు తక్కువై ఎయిర్ పోర్టులో ఉన్న వాళ్లందరి కాళ్లా వేళ్లా పడే సన్నివేశంలో సూర్య నటన చూశాక ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యుత్తమ నటుల్లో సూర్య ఒకడు అని ఒప్పుకోక తప్పదు. ఆ సన్నివేశంలో ఎలాంటి కఠినాత్ముడైనా కదిలిపోయేలా సాగింది సూర్య నటన.
నేషనల్ అవార్డ్ గెలిచే స్థాయిలో ఇక్కడ పెర్ఫామ్ చేశాడు సూర్య. ఇలాంటి అద్భుతమైన.. సూర్య నటన కౌశలాన్ని చాటే ఉద్వేగ భరిత సన్నివేశాలు సినిమాలో మరికొన్ని ఉన్నాయి. అవన్నీ చూశాక ఈ ఏడాదికి ఇండియన్ సినిమాలో నటనకు సంబంధించిన అవార్డులన్నీ సూర్యకే ఇచ్చేయాలేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో పెర్ఫామెన్స్‌తో 2020కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు సూర్య గట్టి పోటీదారుగా మారాడనడంలో సందేహం లేదు.
This post was last modified on November 12, 2020 3:39 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…