సోనియా అగర్వాల్.. తమిళ, తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోయే పేరు కాదిది. ఎక్కువ సినిమాలేమీ చేయలేదు కానీ.. ఒక్క 7-జి బృందావన కాలనీ సినిమాతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఆ సినిమాతో యువ ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్లిపోయిన ఆమె.. ఆ తర్వాత వాళ్లు ఆశించిన సినిమాలు చేయలేదు.
చాలా కెరీర్ ఉండగానే తనకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన దర్శకుడు సెల్వరాఘవన్‌ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది సోనియా. కానీ వాళ్ల వైవాహిక జీవితం ఎంతో కాలం సాగలేదు. కొన్నేళ్లకే విడిపోయారు. ఆ తర్వా సెల్వ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిలైపోయాడు. సోనియా మాత్రం ఒంటరి అయిపోయింది. తిరిగి సినిమాల్లోకి వచ్చింది కానీ.. ఆమె కోరుకున్న పాత్రలు, అవకాశాలు రాలేదు. అయినా ఆమె పోరాటం మాత్రం ఆపట్లేదు.
సైడ్ క్యారెక్టర్లకు పరిమితం అయిపోయిన సోనియా.. ఈ మధ్యే ఎవరో తల్లి పాత్ర ఆఫర్ చేశారని తెగ ఫీలైపోయింది. నాతో పాటు హీరోయిన్లయిన త్రిష, నయనతారలను ఇలా అడుగుతారా అని ప్రశ్నించింది. ఆ సంగతలా ఉంచితే.. ఇంకా హీరోయిన్ పాత్రలు ఆశిస్తోందో ఏమో తెలియదు కానీ.. సోనియా తాజాగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
కొత్త అవతారంలో గుర్తు పట్టలేని విధంగా తయారైన ఆమె.. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని కూడా దాచకుండా బయటపెట్టేసింది. కానీ ఇంతకముందుతో పోలిస్తే బరువు తగ్గి, ముఖాన్ని కొంచెం మార్చుకుని ఏదో ట్రై చేస్తోంది కానీ.. అవేవీ వర్కవుట్ అయ్యేలా లేవు. పూర్తిగా ఆకర్షణ కోల్పోయిన సోనియాకు ఈ దశలో అవకాశాలు రావడం సందేహమే. ఇక సినిమాలు చాలించి వ్యక్తిగత జీవితంలో సెటిల్ కాక ఇంకా ఈ ప్రయత్నాలెందుకని ఆమెకు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on November 12, 2020 8:13 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…