Movie News

ప్యాన్ ఇండియా టీజర్లు – ఎవరు విజేతలు

ఇప్పటి నుంచి రాబోయే ఏడాది కాలంలో రిలీజయ్యే టాలీవుడ్ ప్యాన్ ఇండియా టీజర్లన్నీ వచ్చేశాయి. బడ్జెట్ పరంగా, హైప్ విషయంలో ఒకదానితో మరొకటి ఓ రేంజ్ లో తలపడుతున్నాయి. విడుదల తేదీల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ బిజినెస్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో వీటి మీద క్రేజ్ అంతా ఇంతా కాదు. నిన్న ‘ది రాజా సాబ్’ వేంచేశాడు. తెలుగు జనాల నుంచి యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నెగటివిటీ పెద్దగా లేదు. కాకపోతే ఇలాంటి హారర్ బ్యాక్ డ్రాప్ లు బాలీవుడ్ లో మాములే కాబట్టి అక్కడి జనంలో అంత ఎగ్జైట్ మెంట్ కనిపించలేదు. మారుతీ అన్నట్టు ట్రైలర్ తర్వాత లెక్కలు మారొచ్చేమో చూడాలి.

దీనికన్నా ముందు బాలకృష్ణ ‘అఖండ 2 తాండవం’ యూట్యూబ్ లో రికార్డుల వేట మొదలుపెట్టింది. హిందీ మార్కెట్ ని సీరియస్ గా తీసుకున్న 14 రీల్స్ నిర్మాతలు అప్పుడే ముంబై లాంటి నగరాల్లో పబ్లిసిటీ మొదలుపెట్టారు. కొన్ని షాట్లకు సంబంధించి సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ కనిపించినా ఓవరాల్ గా బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలైన మాట వాస్తవం. రామ్ చరణ్ ‘పెద్ది’ క్రికెట్ షాట్ చూపించిన ప్రభావం చాలా ఎక్కువ. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ టీమ్స్ వాడుకున్నాయి. లక్షలాది రీల్స్ ఇన్స్ టా, ఎక్స్, ఫేస్ బుక్ తదితర మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. పల్లెటూరి మాస్ కి సైతం పెద్ది టీజర్ బాగా రీచ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్  ‘వార్ 2’ మీద వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ మీద యష్ రాజ్ ఫిలిమ్స్ సీరియస్ గా వర్క్ చేస్తోంది.

వీటికన్నా చాలా ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సృష్టించిన యుఫోరియా వేరే లెవెల్. తమన్ స్వరపరిచిన దాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఇప్పటికీ లైవ్ కన్సర్ట్స్ లో లెక్కలేనన్ని సార్లు వాడుకున్నాడు. ప్రాజెక్ట్ మీద అమాంతం బజ్ పెరగడానికి కారణం ఇదే. కాకపోతే ‘హరిహర వీరమల్లు’ టీజర్ ఆశించిన ఇంపాక్ట్ ఇవ్వలేకపోవడం ఫ్యాన్స్ లోటుగా ఫీలవుతున్నారు. నాని ‘ప్యారడైజ్’ కేవలం గ్లిమ్ప్జ్ కాబట్టి దాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేం. ‘విశ్వంభర’ నెగటివ్ రియాక్షన్స్ తెచ్చుకోవడం చూశాం. ‘కన్నప్ప’ ఇంపాక్ట్ చూపించాడు. అన్ని భాషల్లో చూసుకుంటే ఓజి, పెద్ది టీజర్లు ఎక్కువ ప్రభావం చూపించాయనేది ట్రెండ్స్ తేటతెల్లం చేస్తున్న వాస్తవం.

This post was last modified on June 17, 2025 9:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

10 minutes ago

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

1 hour ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

2 hours ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago