ఇటీవలే విడుదలైన నితిన్ తమ్ముడు ట్రైలర్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ఇకపై యూట్యూబ్ వ్యూస్ కొనమని, జెన్యూన్ గా ఎంత మంది చూస్తారో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని స్టేజి మీద ప్రకటించారు. దానికి తగ్గట్టే తమ్ముడు ఎలాంటి ఫేక్ ప్రాపగండాకు పోలేదని అర్థమవుతోంది. ప్రొడ్యూసర్ అఫీషియల్ ఛానల్ లో నాలుగు రోజులకు గాను తమ్ముడు నమోదు చేసిన వ్యూస్ 2.9 మిలియన్లు. టి సిరీస్ ఛానల్ లో మరో 2 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇందులో ఉన్న సాలిడ్ కంటెంట్ ప్రకారం చూసుకుంటే ఇవి చిన్న నెంబర్లు. కానీ ఎలాంటి కృత్రిమ వీక్షణల జోలికి వెళ్ళకపోవడం వల్ల అంకెలు నిజాయతీగా ఉన్నాయి.
కొంచెం వెనక్కు వెళ్తే ఇదే నితిన్ నటించిన ఫ్లాప్ సినిమాల ట్రైలర్ వ్యూస్ చూస్తే నిజమేంటో అర్థమవుతుంది. ఉదాహరణకు ఇతర డిజాస్టర్ల వ్యూస్ చూస్తే ఏవీ 10 మిలియన్లకు తక్కువ లేవు. రిలీజ్ కు ముందు కూడా వీటి మీద పెద్ద బజ్ లేదు. అలాంటప్పుడు అంత పెద్ద అంకెలు కనిపించడం విచిత్రం. నిజానికి ఇది అందరూ నిర్మాతలు, హీరోలు ఫాలో అవుతున్న ప్రాక్టీసే. బయటికి ఎవరూ చెప్పుకోరు కానీ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం కోసమో లేదా బిజినెస్ ని హైప్ చేసుకోవడం కోసమో బోలెడు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓటిటిలు సైతం ఈ వ్యూస్ ని చూసి ప్రీ రిలీజ్ బజ్ అంచనా వేసిన ఉదంతాలు లేకపోలేదు.
దిల్ రాజు తీసుకున్న నిర్ణయం వల్ల తమ్ముడుకి అసలైన మద్దతు ఎంత ఉందనేది స్పష్టత వచ్చింది. సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా ఇవి పెరుగుతాయి. జూలై 4 అది తేలిపోతుంది. కానీ ఇతర ప్రొడ్యూసర్లు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తే మంచిదే. ఎందుకంటే ఉపయోగం లేని ఇలాంటి వ్యూస్ కోసం ఖర్చు పెట్టడం కన్నా క్వాలిటీ, కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ లాంటి ఇతరత్రా వాటి మీద వ్యయం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇంకో పంతొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న తమ్ముడుకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. వచ్చే వారం నుంచి పాటలతో మొదలుపెట్టి పబ్లిసిటీ పెంచబోతున్నారు.
This post was last modified on June 16, 2025 4:03 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…