తెరపై నవ్వించే కమెడియన్లందరి జీవితాలూ హ్యాపీగా సాగిపోతాయనుకుంటే పొరబాటే. వాళ్ల జీవితాల్లో మనకు తెలియని విషాదాలెన్నో ఉంటాయి. వాటిని దిగమింగి తెరపై కామెడీ పండిస్తుంటారు. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో పాపులరై సినిమాల్లో కూడా మెరిసిన చలాకీ చంటి ఈ కోవకే చెందుతాడు. అతడి జీవితంలో పెద్ద విషాదాలే ఉన్నట్లు తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి చాలా కష్టపడి పైకొచ్చాడట చంటి. 1987లో తాను నెలల వయసులో ఉండగా తండ్రి చనిపోయాడని.. ఇంకో ఐదేళ్లకు తన తల్లి తమ కళ్ల ముందే ప్రమాదంలో చనిపోయిందని అతను వెల్లడించాడు. తమ ఇంట్లో గ్యాస్ లీక్ కావడం వల్ల పెద్ద ప్రమాదం జరిగి తల్లి చనిపోయిందని.. అప్పటికి తనకు ఐదేళ్లే అని చంటి చెప్పాడు.
ఆ సమయంలో ఏం జరిగిందో కూడా తనకు అర్థం కాలేదని.. పది రోజుల తర్వాత తల్లి చనిపోయింది, ఇక రాదని తెలిసిందని చంటి వెల్లడించాడు. ఇక అప్పట్నుంచి ఎవరైనా స్నేహితుల ఇళ్లకు వెళ్తే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు అవీ చూస్తే చాలా బాధేసేదని.. వెంటనే బయటికి వచ్చేసేవాడినని అతనన్నాడు. ఈ మధ్య తనకు కూతురు పుడితే మూడు గంటల పాటు ఏడుస్తూ ఉన్నానని.. తన తల్లి తన దగ్గరికి తిరిగొచ్చందనే భావన కలిగిందని చంటి ఉద్వేగంతో చెప్పాడు.
ఇక కెరీర్ విషయానికొస్తే ‘భీమిలి కబడ్డీ’ జట్టు తనకు మంచి పేరు తెచ్చిందని కానీ అంత పేరొచ్చాక ఏడాది పాటు అవకాశాలు రాలేదని.. తన గురించి ఇండస్ట్రీలో జరిగిన చెడు ప్రచారాలే అందుక్కారణమని చంటి చెప్పాడు. దీని కంటే ముందు ‘జల్లు’ అనే సినిమా ఒకటి చేశానని.. అది రిలీజవుతోందని సంబరంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వెళ్లానని.. కానీ అది కేవలం ఒక్క షోకు పరిమితం అయిందని.. తర్వాత తీసేశారని ఆవేదనగా చెప్పాడు చంటి.
This post was last modified on November 11, 2020 4:54 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…