కల్కి వచ్చి ఏడాది దాటేసింది. ప్రభాస్ ని మళ్ళీ ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను నెరవేరుస్తూ డిసెంబర్ 5 ది రాజా సాబ్ రాబోతున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ లుక్స్ తో ఉన్న పోస్టర్లు తప్ప ఇప్పటిదాకా వీడియో కంటెంట్ ఏదీ బయటికి రాకపోవడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ఓ రేంజ్ లో ఉంది. ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో వాళ్ళ ఆకాంక్ష నెరవేరింది. రెండు నిమిషాలకు పైగా దర్శనమిచ్చిన ది రాజా సాబ్ కథేంటో పూర్తిగా గుట్టు విప్పకపోయినా, ఎలా ఉండబోతున్నాడో, అంచనాలు ఎంత పెట్టుకోవాలో కింగ్ సైజ్ శాంపిల్ చూపించాడు.
ఎక్కడో సుదూర అడవి ప్రాంతంలో ఒక పెద్ద కోటలో అంతులేని సంపద ఉంటుంది. చావు తర్వాత కూడా తనే అనుభవించాలనే ఒక రాజు (సంజయ్ దత్) దాని కోసం ఒక వలయాన్ని సృష్టిస్తాడు. మరోచోట ఓ యువకుడు (ప్రభాస్) జీవితాన్ని సరదాగా గడుపుతూ అమ్మాయిల ప్రేమని ఆస్వాదిస్తూ తన లోకంలో తానుంటాడు. అనుకోకుండా కొన్ని అనూహ్య పరిణామాల వల్ల అతను రాజమహల్ కు వస్తాడు. చిక్కుల్లో పడతాడు. అసలీ రాజాకు, అక్కడున్న అంతుచిక్కని రహస్యాలకు సంబంధం ఏంటి, రాజా సాబ్ పదే పదే కలవరించే తాత ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకో ఆరు నెలలు ఎదురు చూడాల్సిందే.
ప్రభాస్ ని ఇలా చూసి ఎంత కాలమయ్యిందో అనిపించేలా దర్శకుడు మారుతీ ప్రెజెంట్ చేసిన విధానం మాములు గూస్ బంప్స్ ఇచ్చేలా లేదు. ముఖ్యంగా ట్రెండీ కాస్ట్యూమ్స్ తో హీరోయిన్స్ తో చేసిన రొమాన్స్, స్టయిలిష్ అవతారంలో రివీల్ చేసిన కట్స్ చాలా బాగున్నాయి. హారర్ ఎలిమెంట్ తీసుకున్నప్పటికీ మునుపెన్నడూ చూడని గ్రాండియర్ లుక్ తో పాటు బోలెడు ట్విస్టులు జోడించిన విధానం అంచనాలు పెంచేలా ఉంది. విఎఫెక్స్ క్వాలిటీ స్పష్టంగా కనిపించింది. సంజయ్ దత్ గెటప్ తో పాటు ఇతర ఆర్టిస్టుల పాత్రలు ఆసక్తిని పెంచుతున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే వంద శాతం డ్యూటీ చేసేసింది. అంచనాలకు మించైతే టీజర్ కాగల కార్యం నెరవేర్చింది.
This post was last modified on June 16, 2025 11:49 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…