Movie News

ప్రభుత్వాన్ని వణికించే ‘కుబేర’ వ్యూహం

జూన్ 20 విడుదల కాబోతున్న కుబేర కోసం ధనుష్, నాగార్జున ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటిసారి కుదిరిన మల్టీ స్టారర్ కాంబినేషన్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందులోనూ శేఖర్ కమ్ముల దర్శకత్వం వల్ల ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. బిజినెస్ పరంగా మంచి హైప్ తెచ్చుకున్న కుబేరకు భారీ బడ్జెట్ అయ్యింది. కొంచెం ఆలస్యమైనా సరే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా కమ్ముల దీన్ని తెరకెక్కించారు. టీజర్ లో సాంపిల్ చూపించాక అందరి దృష్టి ట్రైలర్ మీద ఉంది. ఇవాళ హైదరాబాద్ లో రాజమౌళి అతిథిగా జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దాన్ని లాంచ్ చేశారు.

స్టోరీ ఎక్కువగా దాచకుండా చెప్పేశారు. ఆయిల్ తో పాటు వివిధ వ్యాపారాల పెట్టుబడులతో కోట్లకు పగడలెత్తిన వ్యాపారవేత్త (జిమ్ షర్బ్) దాన్ని అంతులేని సంపద మార్చేందుకు ప్రభుత్వ పెద్దలతో చేతులు కలుపుతాడు. గవర్నమెంట్ ఆఫీసర్ గా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న దీపక్ ( నాగార్జున) ఒక లక్ష్యం కోసం బిచ్చగాడైన దేవా (ధనుష్) ని చేరదీసి అతనికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. అయితే కీలకమైన సమయంలో దేవా మాయమైపోతాడు. దీంతో వందల కోట్ల విలువైన సొమ్ము రిస్కులో పడుతుంది. దేవా, ధనుష్ ల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత జరిగేది థియేటర్లలో చూడాలి మరి.

శేఖర్ కమ్ముల మార్క్ నిండిన కుబేరలో ఈసారి ఎమోషన్స్, లవ్ లాంటివి కాకుండా మనీ క్రైమ్ తో కూడిన సీరియస్ నెరేషన్ ఎంచుకోవడం విభిన్నంగా ఉంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యం దక్కేలా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకునలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం లాంటి టెక్నికల్ సపోర్ట్ కుబేరకు అండగా నిలిచింది. హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి లాంటి సాఫ్ట్ మూవీస్ కి భిన్నంగా కుబేర రాసుకున్న శేఖర్ కమ్ముల, ఈసారి లీడర్ ని మించిన అరెస్టింగ్ డ్రామా ఇస్తాడనే నమ్మకమైతే ఈ వీడియోలో ఇచ్చేశారు. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే అంతకన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంది.

This post was last modified on June 15, 2025 10:27 pm

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

8 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

9 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

10 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

10 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

11 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

11 hours ago