Movie News

మార్కో 2 ఎందుకు ఆపేశారంటే

గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన మలయాళం మూవీ మార్కోకి వసూళ్లతో పాటు విమర్శలు చాలా బలంగా వచ్చాయి. మితిమీరిన వయొలెన్స్ తో ప్రేక్షకులు జడుసుకునే స్థాయిలో హత్యలు చూపించిన తీరు మీద చాలా క్రిటిసిజం వచ్చింది. నార్త్ లో పలు థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఫిర్యాదు చేస్తే షోలు క్యాన్సిల్ చేసిన దాఖలాలున్నాయి. ఎంత హింస పెట్టినా మాస్ ఈ మార్కోని బాగా ఆదరించింది. అప్పటిదాకా టయర్ 2 & 3 మధ్య ఊగిసలాడుతున్న హీరో ఉన్ని ముకుందన్ కి ఇతర భాషల్లో పాపులారిటీ తెచ్చి పెట్టింది. అప్పటి నుంచే మార్కో 2 కోసం డిమాండ్ ఉంది.

తాజాగా మార్కోని కొనసాగించడం లేదని ఉన్ని ముకుందన్ స్వయంగా ప్రకటించాడు. సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ దీని మీద విపరీతమైన నెగటివిటీ ఉందని, అందుకని కొనసాగించే ఉద్దేశం లేదని, ఇంతకన్నా మెరుగైన సినిమాతో మిమ్మల్ని అలరిస్తానని చెప్పి ప్రచారాలకు చెక్ పెట్టేశాడు. వాస్తవానికి దీని వెనుక వేరే కథ ఉందట. మార్కో దర్శకుడు అనీఫ్ అదేని తెలుగులో ఒక ప్రాజెక్టుకి సంతకం చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉండటం వల్ల మార్కో 2 మీద ఎలాంటి ఫోకస్ పెట్టలేకపోతున్నాడు.

పైగా మార్కో నిర్మాతలకే సీక్వెల్ మీద ఆసక్తి లేదు. ఇంతకన్నా వయొలెన్స్ తో పార్ట్ 2 తీస్తే తమ బ్యానర్ కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని గుర్తించి డ్రాప్ అయ్యారు. ఆ హక్కులను కూడా ఎవరికీ ఇచ్చే ఉద్దేశంలో లేరట. ప్రాక్టికల్ గా చూస్తే ఉన్ని ముకుందన్ కు చేయాలని ఉన్నా ప్రొడ్యూసర్, డైరెక్టర్ వైపు నుంచి సహకారం లేనప్పుడు తాను మాత్రం ఏం చేయాలగలడు. అనీఫ్ అదేని ఎవరి కోసం కథ రాస్తున్నాడనే లీక్ బయటికి రాలేదు కాని బాలకృష్ణ పేరు బలంగా వినిపిస్తోంది. ఏదైతేనేం మార్కో 2కి క్యాన్సిల్ చేసి మంచి పని చేశారు. ఇలాంటి కంటెంట్లు ఒక్క భాగంతోనే ఆగిపోవడం ఒకరకంగా మంచిదే.

This post was last modified on June 15, 2025 12:13 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago