రోజా సినిమాతో నిన్నటితరం ప్రేక్షకులను మైమరిపించిన నటి మధుబాల. అలనాటి నటి మధుబాల పేరు పెట్టుకున్న ఆమె.. రోజా సహా కొన్ని చిత్రాలతో ఆ పేరుకు న్యాయం చేసింది. ఐతే ట్రెడిషనల్ హీరోయిన్‌గా ముద్ర పడిపోవడం వల్లో ఏమో.. కెరీర్లో ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది. ఎక్కువ అవకాశాలు సంపాదించలేకపోయింది. ఇప్పటి హీరోయిన్లకు లిప్ లాక్స్, బెడ్ రూం సీన్లు చాలా కామన్ కానీ.. మధుబాల తరహా హీరోయిన్లు అస్సలు వాటి జోలికి వెళ్లేవారు కాదు. తన కెరీర్లో మధుబాల ఎప్పుడూ ముద్దు సీన్ చేసింది లేదు. కానీ తెరపై కనిపించలేదు కానీ.. షూట్‌లో మాత్రం తాను లిప్ లాక్ సీన్ చేసినట్లు మధుబాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
చాలా ఇబ్బంది పడుతూ చేసిన ఆ సన్నివేశం ఎడిటింగ్‌లో లేచిపోయిందని ఆమె తెలిపింది.
తాను ముందు నుంచి ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకమని.. ఏ సినిమాలోనూ ఆ సీన్ చేయలేదని.. కానీ ఒక సినిమా విషయంలో మాత్రం ఆ కండిషన్ పక్కన పెట్టాల్సి వచ్చిందని మధుబాల తెలిపింది. కథకు ఆ సన్నివేశం చాలా కీలకమని.. లిప్ లాక్ చేయాల్సిందే అని చిత్ర బృందం చెప్పడంతో తాను సరే అనక తప్పలేదని మధుబాల తెలిపింది. చాలా ఇబ్బంది పడుతూ ఆ సన్నివేశం చేశానని.. అసౌకర్యానికి గురయ్యానని ఆమె తెలిపింది.
తీరా చూస్తే సినిమాలో ఆ సన్నివేశం లేదని.. అది అవసరం లేదనిపించి ఎడిటింగ్‌లో తీసేశారని ఆమె చెప్పింది. ఈ విషయంలో చిత్ర బృందంతో తానేమీ గొడవ పడలేదని.. సినిమా కోసం ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాల్సి ఉంటుందని కొందరు సీనియర్ నటీమణులను చూసి అర్థం చేసుకున్నానని మధుబాల చెప్పింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చినా.. చివరి దశలో ఆ ఛాన్సులు వేరే వాళ్లను వరించినట్లు ఆమె చెప్పింది. బాజీఘర్‌లో ఓ పాత్రకు తనను అడిగినా.. దానికి అంత ప్రాధాన్యం లేదని తాను నో చెప్పినట్లు మధుబాల వెల్లడించింది.
This post was last modified on June 14, 2025 7:32 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…