Movie News

కావ్యా మారన్ తో పెళ్లిపై స్పందించిన అనిరుధ్

సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని,  ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ కి మూడు ముళ్ళు వేయబోతున్నాడని హఠాత్తుగా నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. ఇవాళ ఉదయానికి అవి పీక్స్ కు చేరుకున్నాయి. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ప్రేమ ఉందని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారని పలు మీడియా సంస్థలు కథనాలు వడ్డించడంతో ఫ్యాన్స్ వాటిని ఆసక్తిగా ఫాలో అయ్యారు. కానీ అనిరుధ్ ఈ గాసిప్ పబ్లిసిటీకి స్పందిస్తూ అలాంటిదేమీ లేదని, ఛిల్ అవ్వమని వాటిని సృష్టించిన వాళ్లకు చెబుతూ తనవైపు నుంచి క్లారిటీ ఇచ్చాడు.

సరే ఖండించడం వరకు బాగానే ఉంది కానీ అనిరుధ్ రవిచందర్ మరీ లేత కుర్రాడేమీ కాదు. వయసు 34 సంవత్సరాలు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా తనకు సంబంధాలు చాలానే వస్తుంటాయి. అందులోనూ రజనీకాంత్ బంధుత్వం ఉంది కాబట్టి ఆయన కూడా సలహా ఇచ్చే ఉంటారు. ఏ ఈడులో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరిగిపోవాలి. కానీ అనిరుధ్ మాత్రం దానికి ఇంకా సమయం ఉందంటున్నాడు. నిజానికి తనకున్న కమిట్ మెంట్లకు స్వంత వేడుక చేసుకునే తీరిక కూడా లేదు. వరస ప్యాన్ ఇండియా సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేంత బిజీలో ఉన్నాడు. అందుకే మ్యారేజ్ దూరం కాబోలు.

ఇక కెరీర్ విషయానికి వస్తే రాబోయే ఆరు నెలలు అనిరుద్ రవిచందర్ కు కీలకం కాబోతున్నాయి. రజనీకాంత్ కూలి మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మీద ఫ్యాన్స్ నమ్మకం అంతా ఇంతా కాదు. విజయ్ చివరి మూవీ జన నాయగన్ కు బెస్ట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. జైలర్ 2 మీద ఎలాగూ ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఇవి కాకుండా ప్రదీప్  రంగనాథ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, శివ కార్తికేయన్ మదరాసి నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నాయి. నాని ది ప్యారడైజ్ మీద ఉన్న అంచనాలు చెప్పనక్కర్లేదు. సో కుర్రాడి పెళ్లి కబురుకు ఇంకొంత కాలం ఆగాల్సిందే. 

This post was last modified on June 14, 2025 6:35 pm

Share

Recent Posts

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

13 minutes ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

3 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

5 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

6 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

6 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

7 hours ago