ఖైదీ సినిమాతో సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు లోకేష్ కనకరాజ్. మూడో చిత్రానికే ఏకంగా కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్‌తో ‘మాస్టర్’ మూవీ చేసే అవకాశం దక్కించుకున్న లోకేష్.. ఆ తర్వాత కమల్ హాసన్‌తో తీసిన ‘విక్రమ్’ మూవీతో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. పనైపోయిందనుకున్న కమల్ హాసన్‌తో అంత పెద్ద హిట్ కొట్టడం ఇండస్ట్రీకి షాక్. ‘లియో’తో అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. ‘కూలీ’తో మళ్లీ తన పవర్ ఏంటో చూపించేలాగే ఉన్నాడు లోకేష్. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఖైదీ-2, విక్రమ్-2, ఆమిర్‌ఖాన్‌తో సూపర్ హీరో సినిమా.. ఇలా తన క్రేజీ లైనప్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. విజయ్ అందుబాటులోకి వస్తే ‘లియో-2’ కూడా చేయాలనుకుంటున్నాడు లోకేష్. వీటిలో ఏది ఎప్పుడు ఉంటుందని అందరూ మాట్లాడుకుంటుండగా.. లోకేష్ హీరోగా సినిమా అంటూ ఇప్పుడు కొత్త న్యూస్ తెరపైకి వచ్చింది. కీర్తి సురేష్ తో ‘సాని కాయితం’, ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్.. లోకేష్‌ను హీరోగా చూపించబోతున్నాడట.
వీరి కలయికలో ఒక యాక్షన్ సినిమా రాబోతోందట. లోకేష్ ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ పొందుతున్నాడట. ఓవైపు ‘కూలీ’ ప్రి ప్రొడక్షన్ పనులను చూసుకుంటూనే.. ఇంకోవైపు తాను హీరోగా నటించే సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడట లోకేష్. శ్రుతి హాసన్‌తో కలిసి గత ఏడాది ‘ఇనిమేల్’ అనే మ్యూజిక్ వీడియోలో లోకేష్ నటించిన సంగతి తెలిసిందే. అందులో తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే సాగింది. నటనలో తడబాటు ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ఏకంగా హీరోగా నటించడానికి రెడీ అయిపోయాడు. ఓవైపు లోకేష్ దర్శకుడిగా చేయాల్సిన సినిమాల జాబితా పెద్దదిగానే ఉంది. ఇంకోవైపు రాఘవ లారెన్స్ హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇంత బిజీగా ఉంటూ మళ్లీ హీరోగా నటించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కోలీవుడ్ జనం.
This post was last modified on June 14, 2025 6:23 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…