టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ ఉన్నట్టుండి జూనియర్ ఎన్టీఆర్ కి వెళ్లిపోవడం పట్ల రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ట్విస్టులన్నీ చూసి ఫ్యాన్స్ లో అయోమయం నెలకొంది. బ్యాక్ స్టోరీ చూస్తే ఏం జరిగిందో అర్థమవుతుంది. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అట్లీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నాడు. అదే సమయంలో త్రివిక్రమ్, బన్నీల మధ్య క్రమం తప్పకుండా తమ కొత్త సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉండేవి.
ఓవర్ బడ్జెట్ తదితర కారణాల వల్ల సల్మాన్ ప్రాజెక్టు రద్దయిపోయింది. అప్పటికే అల్లు అర్జున్ తో టచ్ లో ఉన్న అట్లీ తన దగ్గరున్న ఒక విజువల్ గ్రాండియర్ సబ్జెక్టుని వినిపించాడు. పుష్ప 2 తర్వాత ఇదే రైటని భావించిన బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సన్ పిక్చర్స్ నిర్మాణం కావడంతో పనులు వేగమందుకున్నాయి. దానికి ఎంత లేదన్నా రెండేళ్లు పడుతుందని గుర్తించిన త్రివిక్రమ్ వెంటనే ప్రత్యాన్మయం ఆలోచించాడు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత మళ్ళీ కలిసి పని చేయాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు కబురు పెట్టేశారు. కార్తికేయ స్వామి నేపథ్యంలో అల్లుకున్న కథ బ్రహ్మాండంగా నచ్చేసి కాంబో ఓకే అనుకున్నారు.
ఇలా ఒకపక్క అట్లీతో బన్నీ, ఇంకోవైపు త్రివిక్రమ్ తో తారక్ తమ కలయికలు ఖరారు చేసుకున్నారు. ఇక్కడ ఎవరినెవరు వ్యక్తిగతంగా టార్గెట్లు చేసుకోవడం, ఈగోలకు పోవడం లాంటివేమీ లేవని ఇన్ సైడ్ టాక్. గతంలో అల వైకుంఠపురములో కన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా అనుకున్న త్రివిక్రమ్ దాన్ని ఆపేసిన సంగతి తెలిసిందే. అయినను పోయిరావలె హస్తనకు అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అది క్యాన్సిలైనంత మాత్రాన ఇద్దరి మధ్య బాండింగ్ కి ఎలాంటి ప్రభావం పడలేదు. బన్నీతోనూ భవిష్యత్తులో అలాగే ఉంటుంది. రకరకాల లింకులు ముడిపెట్టి మసాలా జోడించడం తప్ప ఫైనల్ గా ఈ ఎపిసోడ్ సుఖాంతమైనట్టే.
This post was last modified on June 14, 2025 3:36 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…