గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప: ది రూల్’ పాన్ ఇండియ ా స్థాయిలో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘బాహుబలి-2’ తర్వాత ఇండియాలో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా అదే అంటే అతిశయోక్తి కాదు. వసూళ్లలో కూడా ఆ చిత్రానికి దీటుగా నిలిచింది సుకుమార్-అల్లు అర్జున్‌ల చిత్రం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతం వల్ల సక్సెస్‌ను టీం పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయింది కానీ.. లేదంటే సంబరాలు మోతెక్కిపోయేవి. ‘పుష్ప-2’ బేసిగ్గా తెలుగు సినిమానే అయినా.. ఇక్కడి కంటే హిందీలో ఆ సినిమా ఇరగాడింది. కొన్ని వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడాయి.
ఎంత పెద్ద సినిమా అయినా తొలి వీకెండ్ తర్వాత థియేటర్లు ఖాళీ అయిపోతున్న ఈ రోజుల్లో.. రెండు మూడు వారాల తర్వాత కూడా నార్త్ ఇండియాలో టికెట్ల కోసం థియేటర్ల దగ్గర కొట్లాటలు జరగడం ‘పుష్ప-2’ విషయంలో జరిగింది. థియేటర్లలో అంత బాగా ఆడిన ఈ సినిమా.. తర్వాత ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు బుల్లితెర మీద పుష్ప-2 కూడా సంచలనం రేపింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేశారు. అక్కడ వచ్చిన స్పందన చర్చనీయాంశంగా మారింది.
ఇండియా వైడ్ ‘పుష్ప-2’కు 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. విశేష ఆదరణ తెచ్చుకున్న ఐపీఎల్-17కు యావరేజ్‌గా 4.6 టీఆర్పీ వచ్చింది. దాన్ని మించి ‘పుష్ప-2’కు రేటింగ్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. థియేటర్లలోనే కాక టీవీల్లోనూ మంచి స్పందన తెచ్చుకున్న ‘స్త్రీ-2’ సహా అనేక బాలీవుడ్ చిత్రాల టీఆర్పీలను ‘పుష్ప-2’ అధిగమించినట్లు సమాచారం. దీన్ని బట్టే ‘పుష్ప’కు నార్త్ ఇండియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అనుమానాలు ఉన్నప్పటికీ.. ఈ స్పందన చూశాక కొన్నేళ్ల తర్వాత అయినా ‘పుష్ప-3’ తీయకుండా ఆగలేరేమో సుకుమార్, బన్నీ.
This post was last modified on June 14, 2025 2:33 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…