నటులు దర్శకులు కావడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. ఐతే కమెడియన్లలో దర్శకులు అయిన వాళ్లు అరుదుగా కనిపిస్తారు. ఈ తరం కమెడియన్లలో వెన్నెల కిషోర్ ఒకటికి రెండుసార్లు ఈ ప్రయత్నం చేశాడు కానీ.. ఫలితం లేకపోయింది. తన దర్శకత్వంలో వచ్చిన జఫ్ఫా, వెన్నెల వన్ అండ్ హాఫ్ తీవ్రంగా నిరాశపరిచాయి. కిషోర్ మళ్లీ మెగా ఫోన్ పట్టే సాహసం చేయలేదు. ఐతే ఇప్పుడు మరో పేరున్న కమెడియన్ దర్శకుడిగా మారుతున్నాడు. అతనే.. రాహుల్ రామకృష్ణ.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి పేరు సంపాదించి.. కొంత కాలానికే టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ.. దర్శకుడిగా మారే ప్రయత్నంలో ఉన్నాడు. తాను డైరెక్ట్ చేయనున్న తొలి చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపికలో పడ్డాడు రాహుల్. ఇదే విషయమై ‘ఎక్స్’లో పోస్టు కూడా పెట్టాడు. ‘‘దర్శకుడిగా ఇది నా తొలి ప్రాజెక్ట్. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షో రీల్స్, ఫొటోలను నా మెయిల్‌కు పంపించడి’’ అని రాహుల్ పేర్కొన్నాడు.
విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి నిర్మాత కూడా రాహులేనట. షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి పేరు తెచ్చుకున్న రాహుల్‌కు నటుడిగా తొలి సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అని చాలామందికి తెలియదు. కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ఆ చిత్రంలో ఓ చిన్న పాత్ర చేశాడు రాహుల్. ఐతే ‘అర్జున్ రెడ్డి’లో శివ పాత్ర అతడికి పెద్ద బ్రేక్ ఇచ్చింది. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ‘జాతిరత్నాలు’ సహా కొన్ని చిత్రాల్లో హీరో తరహా కమెడియన్ పాత్రలు చేశాడు రాహుల్. ఈ మధ్య అతడికి సినిమాలు కొంచెం తగ్గాయి. ఈ సమయంలోనే దర్శకుడిగా, నిర్మాతగా మారుతున్నాడు.
This post was last modified on June 14, 2025 2:08 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…