ఎల్లుండి కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా మీడియాతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ది రాజా సాబ్ టీజర్ ని భారీ ఎత్తున లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. జాతీయ స్థాయిలో పేరున్న జర్నలిస్టులను ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ బిగ్ స్క్రీన్ మీద దీన్ని ప్రదర్శించబోతున్నారు. యూనిట్ నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరు హాజరు కాబోతున్నారు. ఫౌజీ షూటింగ్ వల్ల ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో హాజరు అనుమానంగానే ఉంది. ఒకవేళ వస్తే స్వీట్ సర్ప్రైజ్ కావొచ్చు. ఇక పర్ఫెక్ట్ స్కెచ్ ఎందుకు అవుతుందో చూద్దాం.
వాయిదాల వల్ల రాజా సాబ్ మీద ముందున్న అంచనాల్లో మార్పులు వచ్చాయి. అందులోనూ దర్శకుడు మారుతీకి రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ రేంజ్ లో బ్రాండ్ ఇమేజ్ లేదు. పైగా దీనికి ముందు తీసినవి ఫ్లాపులు. కాబట్టి కంటెంట్ ఎంత ఎక్స్ ట్రాడినరిగా ఉందో ప్రపంచం మొత్తానికి ఒకేసారి చెప్పాలి. హైదరాబాద్, ముంబై, చెన్నైలో వేర్వేరుగా ఈవెంట్లను చేయడం కన్నా మీడియా మొత్తాన్ని ఒకేచోట చేర్చడం ద్వారా జరిగే ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది. పైగా ఆతిథ్యం విషయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలాంటి అసంతృప్తికి తావివ్వకుండా పక్కాగా సెట్ అవుతున్నాయట.
డిసెంబర్ 5 విడుదల కాబోతున్న ది రాజా సాబ్ బిజినెస్ లో టీజర్ చాలా కీలక పాత్ర పోషించనుంది. 2 నిమిషాల 2 సెకండ్ల వీడియో ద్వారా కొన్ని కోట్ల రూపాయల అదనపు పెట్టుబడులను డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆశించవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ వర్గాలను విపరీతంగా ఆకట్టుకోవాలంటే ఈ స్ట్రాటజీ అవసరం. ఇన్ సైడ్ టాక్ ని బట్టి టీజర్ చాలా డిఫరెంట్ గా ఉందట. వింటేజ్ ప్రభాస్ ని రివీల్ చేయడంతో పాటు హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయనే క్లూ ఇచ్చిన తీరు చాలా బాగా వచ్చిందని అంటున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన రాజా సాబ్ కు తమన్ సంగీతం సమకూర్చాడు.
This post was last modified on June 14, 2025 1:02 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…