ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి దర్శకుడు కం నటుడు బాసిల్ జోసెఫ్ ఒక కథ చెప్పాడని, దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే లీక్ ఒక్కసారిగా సోషల్ మీడియాని ఊపేసింది. జోసెఫ్ చివరిసారి డైరెక్ట్ చేసిన సినిమా మిన్నల్ మురళి. అది సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో ఆడియన్స్ ని మెప్పించిన బ్లాక్ బస్టర్. ఓటిటి రిలీజ్ అయినప్పటికీ జనాలు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా నేపథ్యంలో శక్తిమాన్ కాన్సెప్ట్ ని తీసుకుని ఇప్పటి ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ట్రీట్ మెంట్ సిద్ధం చేశాడనే ప్రచారం జోరుగానే ఉంది. అయితే ఇందులో సగం మాత్రమే నిజమని చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు అట్లీతో చేస్తున్న సినిమా కూడా ఒకరకంగా సూపర్ హీరో సబ్జెక్టే. ఫాంటసీ జానర్ అయినప్పటికీ సైఫై అంశాలతో పాటు నమ్మశక్యం కానీ ప్రపంచాలు, యాక్షన్ ఎపిసోడ్లు, వింతలు విడ్డూరాలు చాలా ఉంటాయి. అంటే కల్కి, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తరహాలో అన్ని రకాల అంశాలను అట్లీ రాసుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వీడియోస్ ని గమనిస్తే అర్థమవుతుంది. దీపికా పదుకునే పాత్ర కూడా సాహసాలు చేసే రాణి తరహాలో ఉంటుందనే క్లూస్ ఆల్రెడీ ఓపెన్ చేశారు. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి సినిమాలు చేయడానికి అల్లు అర్జున్ నిజంగా సంసిద్ధంగా ఉన్నాడా అనేది అనుమానమే.
పైగా త్రివిక్రమ్ కాంబో వార్త రెండేళ్లు ప్రచారం జరిగాక క్యాన్సిల్ అయ్యింది కాబట్టి బన్నీ కమిట్ మెంట్స్ గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేం. గతంలో కొరటాల శివ సినిమా అనౌన్స్ మెంట్ అయ్యాక ఆగిపోయింది. అదే దేవరగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. పుష్ప తర్వాత వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే క్రమంలో అల్లు అర్జున్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడటం లేదు. కాబట్టి బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ ఏదో అనౌన్స్ అయ్యిందనే రేంజ్ లో హడావిడి చేయడం అనవసరం. ప్రస్తుతం తన శ్వాస ధ్యాస అట్లీతో చేస్తున్న ఏఏ 22 మీద తప్ప ఇంక దేని మీద లేదు.
This post was last modified on June 13, 2025 4:06 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…