ఇవాళ కొత్త శుక్రవారం థియేటర్ రిలీజులు చప్పగా ఉన్నాయి కానీ ఓటిటి ద్వారా ఇంట్లోనే కూర్చుని కాలక్షేపం చేసేందుకు బోలెడు ఆప్షన్స్ వచ్చేశాయి. మాములుగా ఇంత మూకుమ్మడి కంటెంట్ ఒకేసారి రావడం అరుదు. వీటిలో బ్లాక్ బస్టర్స్ లేకపోయినా ఆడియన్స్ లో అంతో ఇంతో ఆసక్తి రేపినవి చాలా ఉన్నాయి. నవీన్ చంద్ర ‘ఎలెవన్’కు రిలీజ్ టైంలో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఓటిటి కోసం మూవీ లవర్స్ ఎదురు చూశారు. అది ఈ రోజు నెరవేరింది. తనదే మరో క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్ స్పాట్’ కూడా వరసగా చూసేయొచ్చు. ఈ రెండూ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చాయి.
ఇదే ప్లాట్ ఫార్మ్ లో వచ్చిన మరో మూవీ ‘ఏస్’. విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనరిది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో హీరోయిన్ గా చేస్తున్న రుక్మిణి వసంత్ కథానాయకిగా నటించింది. ఇది తమిళ తెలుగు భాషల్లో డిజాస్టరే కానీ ఓటిటి స్పందన బాగుండొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. నిన్నటి నుంచే సోని లివ్ లో ‘అలప్పుజ జింఖానా’ స్ట్రీమింగ్ అవుతోంది. దీన్ని యువత బాగానే చూశారు. సమంతా నిర్మించిన ‘శుభం’ని హాట్ స్టార్ లో పెట్టేశారు. అక్షయ్ కుమార్ – మాధవన్ ఇంటరెస్టింగ్ కోర్ట్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రియులు భారీగా ఉన్నారు. దీంట్లోనే చూసేయొచ్చు.
ఇక వెంకటేష్ – రానా కలయికలో రూపొందిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు 2’ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. మొదటి భాగంలో విమర్శలు తెచ్చిన బూతులు, బోల్డ్ కంటెంట్ తగ్గించేశామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు కాబట్టి ఈసారి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ జోష్ లో ఉన్న వెంకీ అభిమానులు ఈసారి ప్రత్యేకంగా రానా నాయుడు 2ని చూస్తారు. ఇక్కడ ప్రస్తావించినవి మెయిన్ కంటెంట్లే. వివిధ భాషల్లో వచ్చిన కొత్త ఓటిటి రిలీజులు చాలానే ఉన్నాయి. సో థియేటర్ కు వెళ్లే అవకాశం రాలేదని చింత లేకుండా నెట్టింట్లో ఇంత వినోదం దొరికితే ఇక చింత ఏలా.
This post was last modified on June 13, 2025 11:55 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…