దేశంలో తెలుగు రాష్ట్రాలను మించిన సినీ అభిమానం ఇంకెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలపై మన వాళ్లకు ఉన్న ప్రేమ గురించి ఇతర భాషల వాళ్లు కూడా గొప్పగా చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నన్ని థియేటర్లు మరే రాష్ట్రంలోనూ లేవు. ఇలాంటి చోట ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దాని కోసం మన సినీ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కల తీరబోతున్నట్లుగా నిర్మాత, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
తెలంగాణలో అనేక మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లను కలిగి ఉన్న నారంగ్.. హైదరాబాద్‌లోని హకీంపేటలో భారీ ఐమాక్స్ స్క్రీన్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇంకో రెండేళ్లలో అది అందుబాటులోకి వస్తుందని కూడా ఆయన వెల్లడించారు. దీంతో హైదరాబాదీ సినీ అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. మనకూ ఐమాక్స్ స్క్రీన్ రాబోతోందని సోషల్ మీడియాలో చర్చలు పెట్టారు. కానీ వారి ఆశలపై కొన్ని రోజుల్లోనే నీళ్లు చల్లేశాడు ఐమాక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డేనియల్. హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను చూసి ప్రీతమ్ స్పందించాడు. ఈ వార్తలు నిజం కాదని ఆయన తేల్చేశాడు.
‘‘ఏషియన్ సినిమా ఐమాక్స్ స్క్రీన్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు వార్తలు చూశాను. ఇది నిజం కాదు. హైదరాబాద్‌లో ఐమాక్స్ నిర్మాణం కోసం పలువురు ఎగ్జిబిటర్లతో సంప్రదింపులు జరిపాం. ఇందుకోసం మేం ఎంతో ఆసక్తితో ఉన్నాం. అవకాశాల కోసం చూస్తున్నాం. కానీ ఇప్పటిదాకా ఏ ఒప్పందం జరగలేదు’’ అని ప్రీతమ్ స్పష్టం చేశాడు. బహుశా ఐమాక్స్ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఎగ్జిబిటర్లలో సునీల్ నారంగ్ కూడా ఒకరై ఉండొచ్చు. కానీ అగ్రిమెంట్ కాకుండా ఇలా ప్రకటన చేయడం పట్ల ఐమాక్స్ కార్పొరేషన్ అసహనంతో ఉండొచ్చు. ఈ ప్రకటనను బట్టి హైదరాబాద్‌కు ఐమాక్స్ స్క్రీన్ రాదని అనుకోవడానికి వీల్లేదు. సునీల్ నారంగ్ కావచ్చు. మరొకరు కావచ్చు. ఐమాక్స్ కార్పొరేషన్‌తో టై అప్ అయి వీలైనంత త్వరగా భారీ తెరను హైదరాబాద్‌కు తీసుకురావాలని ఇక్కడి సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on June 12, 2025 2:00 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…