ఏ ముహూర్తాన తమన్ ‘బుట్టబొమ్మ’ పాటను ట్యూన్ చేశాడో.. జాని మాస్టర్-అల్లు అర్జున్ కలిసి దానికి స్టెప్ కంపోజ్ చేశారో కానీ.. దీని రీచ్ మామూలుగా లేదు. ఇప్పటికే ఈ పాట ఇండియా మొత్తాన్ని ఊపేసింది. శిల్పా శెట్టి సహా అనేకమంది బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఈ పాటకు టిక్‌టాక్‌లో స్టెప్పులేశారు. ఉత్తరాది వాళ్లు కూడా ఈ పాటకు ఊగిపోయారు. ఇప్పుడు మన ‘బుట్ట బొమ్మ’ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి ఈ పాటకు స్టెప్పులేయడం విశేషం. వార్నర్‌కు మామూలుగానే ఇండియన్ కల్చర్, మ్యూజిక్ అంటే ఇష్టం. ఇటీవలే అతను తన కూతురితో కలిసి ‘షీలా కీ జవానీ’ పాటకు స్టెప్పులేసి అలరించాడు. ఐతే బాలీవుడ్ మ్యూజిక్ ఎంతైనా ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులరే. కానీ ఒక తెలుగు పాటకు వార్నర్ డ్యాన్స్ చేయడం అన్నది అసాధారణ విషయం.
ఈ పాట రీచ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది నిదర్శనం. ఏదో ఆషామాషీగా కాకుండా వార్నర్, అతడి భార్య బాగానే ప్రాక్టీస్ చేసి ఈ పాటకు డ్యాన్స్ చేశారని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇండియన్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేద్దామనుకున్నపుడు వెతికి వెతికి షీలా కీ జవానీ తర్వాత ‘బుట్ట బొమ్మ’ను వార్నర్ ఎంచుకున్నాడంటే ఇది ఏ స్థాయిలో పాపులర్ అయిందో కూడా అర్థం చేసుకోవచ్చు. బన్నీని అనుకరిస్తూ అతను ప్యాంటును కూడా కొంత సర్దుకోవడం విశేషం. పాట మధ్యలో వార్నర్ కూతురు మధ్యలో వచ్చి చేసిన సందడి ఇందులో అసలైన హైలైట్. ఈ వీడియోను వార్నర్ ఇలా పోస్ట్ చేయడం ఆలస్యం.. అలా సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పుడు ట్విట్టర్లో ఎక్కడ చూసినా ఈ వీడియోనే హల్ చల్ చేస్తోంది. ఇక బన్నీ పీఆర్వోలు ఊరుకుంటారా? దీన్ని మరింత వైరల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్లంతా. వార్నర్ తన పాటకు డ్యాన్స్ చేయడం పట్ల బన్నీ కూడా చాలా సంతోషించాడు. ‘థ్యాంక్ యు వెరీ మచ్.. రియల్లీ అప్రిషియేట్ ఇట్’ అని ట్వీట్ చేశాడు. దీనికి వార్నర్ కూడా బదులివ్వడం విశేషం. ‘‘థ్యాంక్ యు ఫర్ ద అమేజింగ్ సాంగ్’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. ఇలా ఓ టాలీవుడ్ హీరో పాటకు ఆస్ట్రేలియా అగ్రశ్రేణి క్రికెటర్ డ్యాన్స్ చేసి.. అతడికి థ్యాంక్స్ కూడా చెప్పడం ఊహకందని విషయం.
This post was last modified on April 30, 2020 7:50 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…