టాలీవుడ్ లో ప్రముఖ గాయని మంగ్లీ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పార్టీలో మద్యం, గంజాయి సేవించారని ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. చేవెళ్లలోని ఓ రిసార్ట్ లో మంగ్లీ, తన మిత్రులు పార్టీ చేసుకుంటున్న సమయంలో లిక్కర్, గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, పోలీసులు రిసార్ట్ లో రైడ్ చేస్తున్న సమయంలో వీడియోలు తీయవద్దంటూ విలేకరులను మంగ్లీ బెదిరించిన వైనం షాకింగ్ గా మారింది. ఈ పార్టీలో పాల్గొన్న 48 మందికి టెస్ట్ చేయగా..9 మంది గంజాయి సేవించినట్లు తేలింది. దీంతో, మంగ్లీ, రిసార్ట్ నిర్వాహకులు, ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మంగ్లీ తొలిసారి స్పందించారు. తన అమ్మా, నాన్న కోరిక మేరకు రిసార్ట్ లో పుట్టిన రోజు వేడుక జరుపుకున్నానని చెప్పారు. అయితే, పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్ లేవని…ఆధారాలు లేకుండా అభియోగాలు మోపవద్దని అన్నారు. ఇక, పార్టీ సందర్భంగా సౌండ్ సిస్టం, లిక్కర్ కు పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదని, ఎవరైనా చెప్పి ఉంటే పర్మిషన్ తీసుకునేదానినని అన్నారు. ఇది తెలియకుండా జరిగిన తప్పని చెప్పారు.
‘‘ఒక చిన్న ఇంట్లో పార్టీలాగా చేసుకున్నాం, మా అమ్మానాన్న, వారి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, నా క్రూ మెంబర్స్ ఉన్నారు… మా అమ్మానాన్నను పక్కనపెట్టుకొని డ్రగ్స్ వంటివి పార్టీలో ఉంచుతామా చెప్పండి’’ అని మంగ్లీ అన్నారు. పోలీసులకు కూడా ఆ ఆధారాలు దొరకలేదని, అసలు తాము డ్రగ్స్, ఫారెన్ లిక్కర్ వాడలేదని, కేవలం లోకల్ బ్రాండ్ మద్యం వాడామని చెప్పారు. కొద్ది రోజుల క్రితం గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు తన పార్టీలో ఉన్నారని, వారికి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్పారని, ఆ విషయంపై పోలీసులు మరింత విచారణ చేస్తున్నారని అన్నారు. సమాజంలో ఒక రోల్ మోడల్ గా, ఇన్ స్పిరేషన్ గా ఉండాలనుకుంటున్న తాను ఇటువంటి పనులు చేస్తానా అని ప్రశ్నించారు. దయచేసి నిరాధార ఆరోపణలు చేయవద్దని, ఆధారాలు లేకుండా అభియోగాలు మోపవద్దని మీడియాకు మంగ్లీ రిక్వెస్ట్ చేశారు.
This post was last modified on June 12, 2025 9:54 am
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…