ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్‌గా ఉన్న దిల్ రాజు.. తాను ప్రొడక్షన్లో ఎదగడానికి ఎం.ఎస్.రాజునే స్ఫూర్తి అని చెప్పారు. ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అలాంటి సినిమాలు తీశారు మరి. శత్రువు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో తిరుగులేని స్థాయిని అందుకున్నారాయన. రాజు ప్రొడక్షన్లో వచ్చే సినిమాలన్నింట్లోనూ ఒక అభిరుచి కనిపించేది. దర్శకులతో సమానంగా ఆయన పేరు సంపాదించాడు.
అలాంటి నిర్మాత తర్వాతి కాలంలో వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయాడు. అలా ఆగిపోయినా సరిపోయేది కానీ.. రాజు మెగా ఫోన్ పట్టి డర్టీ హరి అనే సినిమా తీసి తన అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నాడు. పేరుకు తగ్గట్లే ఇందులో బోలెడంత డర్టీనెస్ కనిపిస్తుండటమే అందుక్కారణం.
ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అన్నింట్లోనూ బూతు తప్ప ఇంకేమీ కనిపించలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేశారు. ఎప్పుడో బాలీవుడ్ బిగ్రేడ్ సినిమాల్లో చూసిన ఇంటిమేట్ సన్నివేశాల స్ఫూర్తి తప్ప ఇందులో ఏమీ కనిపించలేదు. కామంతో కటకటలాడిపోతున్న అమ్మాయి, అబ్బాయి.. ఎక్కడ పడితే అక్కడ.. చిత్ర విచిత్ర భంగిమల్లో శృంగార కార్యకలాపాల్లో మునిగిపోవడం.. తమ శృంగార కాంక్షను రకరకాల పద్ధతుల్లో వ్యక్తం చేయడం.. ఇది తప్ప పాటలో ఇంకేమీ లేదు.
మర్డర్ సహా అనేక బాలీవుడ్ సినిమాల్లో చూసిన ఇంటిమేట్ సీన్లను రాజు కాపీ కొట్టాడు. ఊరూ పేరు లేని ఏ దర్శకుడో ఇలాంటి సినిమాలు తీస్తే ఆశ్చర్యపోం కానీ.. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు అందించి గొప్ప అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు సంపాదించిన ఎం.ఎస్.రాజు నుంచి ఇలాంటి చిత్రం రావడమే ఆశ్చర్యం. తానేదో కళాఖండం తీసినట్లు ఈ పాట మధ్యలో క్యామియో కూడా చేశాడు రాజు.
This post was last modified on November 11, 2020 10:57 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…