Movie News

వేటు పడ్డ దర్శకుడికి ఎట్టకేలకు ఛాన్స్

బాలీవుడ్లో వినూత్న చిత్రాలతో మంచి పేరు సంపాదించిన దర్శకుడు వికాస్ బల్. అతను రూపొందించిన ‘క్వీన్’ ఒక సెన్సేషనే. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అప్పటికి అదే తొలిసారి. ఈ చిత్రం దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. వికాస్ ఆ తర్వాత డైరెక్ట్ చేసిన పెద్ద సినిమా ‘సూపర్ 30’. హృతిక్ రోషన్ హీరోగా సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సైతం విమర్శల ప్రశంసలందుకుంది. బాక్సాఫీస్ హిట్టూ అయింది.

ఐతే ఈ సినిమా చేస్తుండగా ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న వికాస్‌కు చిత్ర నిర్మాతలు షాకిచ్చారు. వికాస్ కూడా భాగస్వామి అయిన నిర్మాణ సంస్థ నుంచి తొలగించారు. వికాస్ లేకుండానే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిగాయి.

ఇలా ఓ పేరున్న సినిమా నుంచి అర్ధంతరంగా ఓ దర్శకుడిని తప్పిస్తే జరిగే డ్యామేజీనే వేరు. కానీ వికాస్ మీద వచ్చినవి తీవ్ర ఆరోపణలు కావడం, దానిపై కేసు కూడా నడుస్తుండటంతో అతడి మిత్రుడే అయిన మరో నిర్మాత అనురాగ్ కశ్యప్ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. దీంతో వికాస్ ఏడాదికి పైగా ఖాళీగా ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అతడికి అవకాశాలివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఐతే ఎట్టకేలకు అతను ఓ అవకాశం అందుకున్నాడు.

ఇప్పటిదాకా కథా ప్రధానమైన వినూత్న చిత్రాలు రూపొందించిన వికాస్.. ఈసారి ఒక మాస్ మసాలా సినిమా చేయడానికి రెడీ అవుతుండటం విశేషం. ఆ చిత్రం పేరు.. గణ్‌పత్. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ఇందులో కథానాయకుడిగా నటించనున్నాడు. టైగర్‌కు మంచి పేరు తెచ్చిన ‘బాగి’ లాగే ఇది కూడా ఒక ఫ్రాంఛైజీగా కొనసాగనుంది. ఆరంభించడంతోనే ‘గణ్‌పత్- పార్ట్ 1’ అని ప్రకటించారు. ‘బాగి’ స్టయిల్లోనూ ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. మరి రూటు మార్చి సినిమా తీస్తున్న వికాస్‌కు ఈసారి ఎలాంటి ఫలితం అందుతుందో చూడాలి.

This post was last modified on November 11, 2020 8:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

14 mins ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

6 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

9 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

10 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

10 hours ago