చిన్న సినిమాగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. ఒక యువకుడి జీవితాన్ని, ప్రేమను తెరమీద ఆవిష్కరించిన తీరు యువతను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు గిరీష్ ఏడి మీద ప్రశంసలు కురిశాయి. అయితే ప్రేమలు 2ని ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా మల్లువుడ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడీ సీక్వెల్ కి బ్రేక్ వేశారట. మొదటి భాగంలో హీరోగా నటించిన నస్లెన్ కె గఫూర్ కు ఫైనల్ వెర్షన్ నచ్చనందు వల్ల ఇది చేయనని చెప్పడంతో నిర్మాతలు అయోమయంలో పడినట్టు సమాచారం. హీరోయిన్ మమిత బైజు రెడీగా ఉన్నా నస్లెన్ వల్ల పార్ట్ 2 రిస్క్ లో పడింది.
ఒకవేళ హీరోని మార్చి తీస్తే నెగటివ్ రియాక్షన్లు వస్తాయని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సచిన్ పాత్రలో నస్లెన్ చూపించిన అమాయకత్వం, నటన కంటెంట్ ని బాగా నిలబెట్టాయి. ఇప్పుడు వేరొకరిని తీసుకుంటే పోలికలతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే కొన్నాళ్ళు ప్రేమలు 2కి బ్రేక్ వేసి కొత్త వెర్షన్ రాసుకున్నాక మళ్ళీ చర్చించుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కేరళ మీడియా మాత్రం అలాంటిదేం లేదని, కొంత ఆలస్యమైనా ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని అంటోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా రాలేదు.
అచ్చం ఇదే సమస్య బాలీవుడ్ మూవీ హేరా ఫేరీ 3కి రావడం కొద్దిరోజుల క్రితం చూశాం. పరేష్ రావల్ తాను మూడో భాగంలో నటించనని తప్పుకోవడంతో అక్షయ్ కుమార్ ఏకంగా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధ పడ్డాడు. సమస్యని ఏదో విధంగా పరిష్కరించేలా నిర్మాతలు ట్రై చేస్తున్నా ఇది జరిగే పనిలా కనిపించడం లేదని ముంబై టాక్. కొన్ని సీక్వెల్స్ కి కొందరు లేకుండా ఊహించలేం. ఉదాహరణకు బాహుబలి 2లో కన్నప్పగా సత్యరాజ్ బదులు వేరే ఆర్టిస్టు చేస్తే ఎలా ఉంటుంది. ఉహించుకోవడమూ కష్టమే. అందుకే ప్రేమలు 2 ఇదే ఇబ్బందిని గుర్తించి పెండింగ్ పెట్టిందట. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.
This post was last modified on June 11, 2025 2:04 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…