ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆమె పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. తాజాగా మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ శివార్లలోని ఈర్లపల్లి వద్ద ఒక రిసార్టులో జరిగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు గంజాయి, విదేశీ మద్యం సరఫరా అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రిసార్టుపై దాడి చేశారు.
అనుమతి లేని విదేశీ మద్యంతో పాటు గంజాయి దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకుని మంగ్లీతో పాటు రిసార్ట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ పార్టీలో దాదాపు 50 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాళ్లందరికీ పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మంది గంజాయి తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పార్టీలో కొందరు సినీ జనాలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగ్లీ ఇటీవల తరచుగా నెగెటివ్ న్యూస్‌లతో నిలుస్తోంది. కొన్ని నెలల కిందట శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయానికి వెళ్లిన ఆమెకు రాచమర్యాదలు దక్కడం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయడం పట్ల తెలుగుదేశం అభిమానులు మండిపడ్డారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా టీవీ షోలు చేయడంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా చేసి.. వైసీపీ హయాంలో పదవి కూడా దక్కించుకున్న ఆమెకు ఈ గౌరవం దక్కడం తెలుగుదేశం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంలో ఆమె తాను ఏ పార్టీకీ వ్యతిరేకం కాదంటూ ఒక మీడియా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆ గొడవ తర్వాత ఇప్పుడు మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి దొరకడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్, వైసీపీ మద్దతుదారుగా ముద్ర ఉన్న మంగ్లీ ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.
This post was last modified on June 11, 2025 12:25 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…