ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్న చిత్రం.. ‘నాయకన్’. టైమ్ సంస్థ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాలంటూ వంద సినిమాాలను ప్రకటిస్తే.. అందులో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న మూవీ ‘నాయకన్’. ఇలాంటి సినిమాను అందించిన కమల్ హాసన్-మణిరత్నం కలయికలో ఓ సినిమా వస్తుంటే అభిమానుల ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. పైగా ఇది ‘నాయకన్’ను మించిన సినిమా అంటూ కమల్ పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు.
ట్రైలర్ చూస్తే ‘నాయకన్’ను మించకపోయినా.. డీసెంట్ మూవీనే అయ్యుంటుందని ఆశించారు ప్రేక్షకులు. కానీ తీరా థియేటర్లకు వెళ్లిన వాళ్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది. మణిరత్నం కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్‌తో మొదలైన ఈ సినిమా.. ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. కొందరు తమిళ క్రిటిక్స్, అక్కడి ప్రేక్షకులు తొలి రోజు దీనికి కూడా హైప్ ఇచ్చుకున్నారు. కానీ అక్కడ కూడా సినిమా నిలబడలేదు.
తెలుగులో ఒక్క షో పూర్తి కాగానే ‘థగ్ లైఫ్’ పెద్ద డిజాస్టర్ అని తేలిపోయింది. రిలీజ్‌కు ముందు ఉన్న అంచనాల కారణంగా తొలి రోజు రూ.కోటి షేర్ రాబట్టింది ‘థగ్ లైఫ్’. తర్వాత నాలుగు రోజులు కలిపినా షేర్ కోటిని మించలేదు. సోమవారానికే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. జనం లేక షోలు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి. ఇక థియేటర్ల నుంచి వచ్చే ఆదాయమేమీ లేనట్లే. రూ.18 కోట్లకు సినిమాను కొన్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి.. రూ.2 కోట్ల ఆదాయంతో సరిపెట్టుకుంటున్నారు.
ఒక డబ్బింగ్ మూవీ మీద రూ.16 కోట్ల నష్టం అంటే ఎంత పెద్ద దెబ్బో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు కమల్ మూవీ ‘విక్రమ్’తో సంపాదించిన దాని మీద కొన్ని రెట్లు ఇప్పుడు నష్టపోతున్నారాయన. ఇక తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో కూడా ‘థగ్ లైఫ్’ బయ్యర్లను నిలువునా ముంచేసింది. రూ.250 కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. అందులో నాలుగో వంతును మించి థియేటర్ల నుంచి రాబట్టేలా లేదు. తమిళనాడులో సినిమా ఓ మోస్తరుగా నడుస్తోంది. మిగతా చోట్ల ఆల్రెడీ వాషౌట్ అయిపోయింది. ‘నాయకన్’ కాంబో అని ఎంతో ఎగ్జైట్ అయితే.. మళ్లీ ఈ జోడీ ఎందుకు కలిసిందా అని అందరూ తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates