మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీ కన్నప్పలో తండ్రి మోహన్ బాబుతో పాటు తన ముగ్గురు పిల్లలు నటిస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ ఎందుకు లేడనేది ఓపెన్ సీక్రెట్. అయితే మంచు లక్ష్మిని భాగం చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ప్రస్తావన ఎవరూ తేవడం లేదు కానీ ఆ సందర్భమైతే వచ్చింది. ఒక ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కన్నప్పలో తాను ఎందుకు లేనో విష్ణునే అడగాలని, బహుశా తానుంటే ఇంకెవరు కనిపించరని కాబోలు అంటూ చమత్కరించింది. త్వరలోనే తను ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు రెడీ అవుతోంది.
సో మంచు లక్ష్మి కన్నప్పలో ఎందుకు లేదనే క్లారిటీ వచేసినట్టేగా. నిజానికి అంత పెద్ద స్పాన్ ఉన్న కథలో ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయినా పొందుపరిచలేదంటే ఏదైనా కారణం ఉందేమో. మనోజ్ కి మద్దతిస్తున్న కారణంగానే మంచు లక్ష్మి కన్నప్పకు దూరంగా ఉండాల్సి వచ్చిందేమోననే అనుమానం జనాల్లో లేకపోలేదు. ఉంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అయ్యేదిగా. ప్రస్తుతం ఆవిడ ముంబైలోనే నివాసం ఉంటున్నారు. ఏదైనా ప్రమోషన్ లేదా ప్రోగ్రాం ఉంటే తప్ప భాగ్యనగరంలో కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ఈవెంట్ ఉంది కాబట్టి మీడియా మైకు ముందుకొచ్చి ఓ రెండు మాటలు చెప్పింది.
జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు సర్వం సిద్ధం చేసి ఉంచారు. విష్ణు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో థియేటర్లలో కన్నప్ప వచ్చాకే ఓటిటి డీల్ చేసుకుందామని చెప్పి పంపడం ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ డ్రామాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే గుంటూరులో జరిగింది. హైదరాబాద్ లో ఒక వేడుక ప్లాన్ చేసి దానికి ప్రభాస్ ని తీసుకురావాలనే ప్రయత్నాల్లో విష్ణు ఉన్నాడు. ఎంతమేరకు సఫలీకృతమవుతాడో షూటింగ్స్ లో బిజీగా ఉన్న డార్లింగ్ డేట్స్ ని బట్టి ఉంటుంది.
This post was last modified on June 9, 2025 12:01 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…