Movie News

చిరు దెబ్బకు కేసీఆర్ షేక్


కరోనాను జనాలు మరీ సీరియస్‌గా తీసుకునే రోజులు పోయాయి. ఇప్పటికీ దాని ప్రభావం కొనసాగుతున్నా.. వైరస్ ధాటికి ప్రాణాలు పోతున్నా జనాల్లో భయం మాత్రం తగ్గిపోయింది. అందరూ అన్ని చోట్లా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. శానిటైజర్ల వాడకం తగ్గింది. మాస్కుల సంగతి కూడా అంతగా పట్టించుకోవట్లేదు. ఐతే ఈ నిర్లక్ష్యం ప్రమాదమనే వైద్య నిపుణులు అంటున్నారు. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ఎంతమాత్రం అలక్ష్యం ప్రదర్శించడానికి వీల్లేదని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా సరే.. జనాల్లో భయం కనిపించడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. రఘు కుంచె కూతురి పెళ్లిలో, సీఎం కేసీఆర్‌ను కలిసినపుడు చిరు మాస్కు లేకుండా కనిపించారు. ఆయన దగ్గర మాస్కు ఉన్నప్పటికీ ఫొటోలకు పోజులివ్వడం కోసమో ఏమో తీసి పక్కన పెట్టేశారు. ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భయపెట్టేస్తున్నట్లు సమాచారం.

కరోనా పెద్ద వయస్కుల మీద తీవ్ర ప్రభావమే చూపుతోంది. కోట్లు ఖర్చు చేసినా, అత్యుత్తమ వైద్య చికిత్స అందినా సరే చాలామంది ప్రముఖుల ప్రాణాలు నిలవని నేపథ్యంలో.. చిరుకు కరోనా అని తెలియగానే కేసీఆర్ షేక్ అయినట్లు తెలుస్తోంది. ఆయన వెంటనే తన ఫామ్‌ హౌస్‌కు వెళ్లిపోయి క్వారంటైన్ అయ్యారు. ఆయన దగ్గరే ఒక వైద్యుడిని కూడా ఉంచుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు 66 ఏళ్లు. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు.

కరోనా విషయంలో జనాల్ని జాగృత పరుస్తూ వస్తున్న సీఎం.. తాను మాత్రం మాస్కుతో కనిపించిన సందర్భాలు అరుదు. మీడియాలో కనిపించే ఫొటోల్లో కేసీఆర్ చాలా వరకు మాస్కు లేకుండానే కనిపిస్తున్నారు. ఐతే ఇప్పటిదాకా కేసీఆర్‌ చుట్టూ ఉన్న వాళ్లు, కలిసిన వాళ్లలో ఎవరూ కరోనా బారిన పడ్డట్లు పెద్దగా వార్తలు రాలేదు. ఆయన కూడా తనను కలిసే వారితో దూరంగానే ఉంటూ వచ్చారు.

కానీ చిరు ఆయనతో సన్నిహితంగానే మెలిగారు. చాలా సమీపంలోకి వచ్చి వరద సాయం చెక్కును అందజేశారు. దీంతో కేసీఆర్ భయపడుతున్నట్లు తెలిసింది. కేసీఆర్‌తో పాటు చిరును కలిసిన సంతోష్‌లకు కరోనా పరీక్ష చేయిస్తే ప్రస్తుతానికి నెగెటివ్‌యే వచ్చింది. ఐతే ఇద్దరూ క్వారంటైన్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోనున్నారు.

చిరుతో కలిసి నాగ్ కూడా కేసీఆర్‌ను కలిసిన నేపథ్యంలో ఆయన కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఆయన హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ టీం కూడా జాగ్రత్త పడాల్సిందే. చిరును చరణ్ కూడా కలిసి ఉంటాడు కాబట్టి అతను నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ టీంపైనా ప్రభావం ఉండకపోదు. మొత్తానికి చిరు ఒక్కడికి కరోనా అనగానే అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల్లో కలకలమే రేగింది.

This post was last modified on November 10, 2020 3:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…

37 minutes ago

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

1 hour ago

అమిత్ షాకు షర్మిల కౌంటర్

పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…

1 hour ago

పార్ల‌మెంటు ముందే అధికార-ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌

దేశ చ‌రిత్ర‌లో.. ముఖ్యంగా ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ప‌రిఢ‌విల్లుతున్న భార‌త దేశంలో తొలిసారి ఎవ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న‌..…

2 hours ago

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

3 hours ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

3 hours ago