Movie News

లెజెండరీ నటిని చెట్టు వెనుక దుస్తులు మార్చుకోమంటే..

సౌత్ ఇండియన్ లెజెండరీ నటీమణుల్లో శోభన ఒకరు. 80వ దశకం నుంచి సినిమాల్లో నటిస్తూ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారామె. ‘మణిచిత్రతాళు’ సహా ఆమె అద్భుత అభినయానికి ఉదాహరణగా నిలిచే సినిమాలు చాలానే ఉన్నాయి. మాతృభాష మలయాళం అయినా.. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అనేక భాషల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు శోభన. అలాంటి నటిని ఓ సినిమా సెట్లో చేదు అనుభవం ఎదురైందట. షూటింగ్ జరుగుతున్న చోట పెద్ద సంఖ్యలో జనం ఉండగా.. చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమని ఆమెకు చెప్పారట. ఇది అమితాబ్ బచ్చన్ పక్కన తాను జోడీగా నటించిన సినిమా సందర్భంగా జరిగినట్లు ఆమె తెలిపారు. ఐతే ఆ సమయంలో అమితాబ్ జోక్యం చేసుకుని ఇబ్బందిని సరి చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ అనుభవం గురించి శోభన ఏమన్నారంటే..

‘‘అమితాబ్ ఎంతో మంచి వ్యక్తి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఏమీ మారలేదు. గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి ఆయన. నేను ఇటీవల ఆయనతో కలిసి ‘కల్కి’ సినిమా చేశాను. దీని కంటే ముందు చాలా ఏళ్ల కిందట ఆయన పక్కన కథానాయికగా నటించాను. ఆ సినిమా కోసం ఒక పాట చేశాం. అందులో భాగంగా నేను చాలాసార్లు దుస్తులు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ పాట చిత్రీకరణ అహ్మదాబాద్‌లో జరుగుతుండగా.. అమితాబ్‌ గారిని చూసేందుకు చాలామంది అభిమానులు వచ్చారు.

వాళ్లంతా అక్కడ ఉండగా.. నేను డ్రెస్ మార్చుకోవడం కోసం కారవాన్ ఎక్కడ అని అడిగాను. దీంతో టీం సభ్యుల్లో ఒకరు.. ‘ఆమె కేరళ నుంచి వచ్చింది. అక్కడి వాళ్లు దేనికైనా సర్దుకుపోతారు. ఆమె చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చకుంటుందిలే’ అన్నారు. ఆ మాటను వాకీ టాకీ ద్వారా అమితాబ్ బచ్చన్ విన్నారు. తన కారవాన్ నుంచి బయటికి వచ్చి ఆ వ్యక్తి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత తన కారవాన్‌ నాకు ఇచ్చారు. ఇప్పటికీ ఆయనేమీ మారలేదు. ‘కల్కి’ కోసం అమితాబ్‌తో మరోసారి కలిసి పని చేశాను. ఎవరైనా తన దగ్గరికి వస్తే లేచి నిల్చుని విష్ చేసేవారు. మీరు అలా చేయాల్సిన అవసరం లేదన్నా వినేవారు కాదు’’ అని శోభన వెల్లడించింది.

This post was last modified on June 8, 2025 6:24 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Shobhana

Recent Posts

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

1 hour ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

4 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

4 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

4 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

5 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

5 hours ago