తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న సుధాకర్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. రెండేళ్లకు మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్న హీరోలను దుయ్యబట్టిన తీరు, పరిస్థితి ఇలాగే కొనసాగితే సింగల్ స్క్రీన్లు మూతబడి ఫంక్షన్ హాల్స్, గౌడౌనులుగా మారిపోయే ప్రమాదాన్ని వర్ణించిన విధానం హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల షేర్ వసూలు చేయలేని ఒక హీరోకు పిలిచి మరీ పదమూడు కోట్ల పారితోషికం ఎలా ఇస్తారంటూ పేర్లు ప్రస్తావించకుండా ఆగ్రహం వ్యక్తం చేయడం మీడియాను ఆశ్చర్యపరిచింది.
ఇప్పటిదాకా అయిదు నెలల్లో కేవలం మూడు సినిమాలు మాత్రలు లాభాలు ఇచ్చాయని అవి సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ అని మిగిలినవన్నీ డిజాస్టర్లని తేల్చేసిన సుధాకర్ ఒకరకంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే డాకు మహారాజ్, తండేల్, హిట్ 3 ది థర్డ్ కేస్, సింగిల్ లాంటి సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అయినవే. వీటిని ఏ కోణంలోనూ ఫ్లాప్స్ గా చూడలేం. బ్రేక్ ఈవెన్ – లాభనష్టాలు కొన్ని ఏరియాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చేమో కానీ వర్కౌట్ అయిన మాట వాస్తవం. హిట్ 3 గురించి మాత్రం ట్రేడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేం.
ఈ లెక్కల సంగతి పక్కనపెడితే హీరోలు వేగం పెంచడం గురించి చర్చించిన అంశం మాత్రం సీరియస్ గా ఆలోచించాల్సిందే. థియేటర్ ఫీడింగ్ కు సరైన సినిమాలు లేక నెలల తరబడి థియేటర్ మెయింటెనెన్సులు ఎగ్జిబిటర్లకు భారంగా మారాయి. గత రెండు మూడు వారాల నుంచి పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. హరిహర వీరమల్లు లాంటి పరిణామాలు గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది. స్నాక్స్ ధరలు, హీరోల స్పీడ్, టికెట్ రేట్లు తదితరాల సంగతి ఎలా ఉన్నా కంటెంట్ లో క్వాలిటీ ఉంటే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారని ఎన్నోసార్లు ఋజువయ్యింది. హీరోలు దర్శకులు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇదే.
This post was last modified on June 7, 2025 10:56 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…