Movie News

మహేష్ సినిమా వదులుకోవడం ఏమిటయ్యా

ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మూవీగా నిర్మాణంలో ఉన్న ఎస్ఎస్ఎంబి అప్డేట్స్ ఈ మధ్య ఆగిపోయాయి. మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ మీద షూట్ చేసిన ఒక సీన్ తాలూకు వీడియో లీకయ్యాక జక్కన్న మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు బ్రేక్ ఇచ్చారు లాంటి వివరాలు వీలైనంత వరకు బయటికి రాకుండా చూస్తున్నారు. ఇదిలా ఉండగా కీలకమైన మహేష్ తండ్రి క్యారెక్టర్ కు బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ ని అడిగారనే వార్త రెండు రోజులుగా ముంబై వర్గాల్లో వినిపిస్తోంది. ఇరవై కోట్లు ఆఫర్ చేసినా ఆయన మొహమాటం లేకుండా సున్నితంగానే నో చెప్పారని వాటి సారాంశం.

దీన్ని కాసేపు నిజమే అనుకుంటే ఇంతకన్నా బ్యాడ్ డెసిషన్ ఈ విలక్షణ నటుడి కెరీర్ లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇటీవలే విడుదలైన హౌస్ ఫుల్ 5 అనే అర్థం పర్థం లేని బూతుల సినిమాలో నటించిన నానాజి ఆ కథలో ఏం కామెడీ కనిపించిందో, తానే చేసి తీరాలనే ఆలోచన ఎందుకు కలిగిందో కానీ ఇప్పుడా చిత్రమే తీవ్ర విమర్శలకు లోనవుతోంది. హౌస్ ఫుల్ సిరీస్ లో గతంలో నటించి ఉండొచ్చు కానీ ఇంత వరస్ట్ సబ్జెక్టుతో తన దగ్గరికి వచ్చినప్పుడు నో చెప్పాలి కదా. రాజమౌళి లాంటి విఖ్యాత దర్శకుడు అడిగాడంటే పాత్ర ఖచ్చితంగా చాలా ప్రాధాన్యం కలిగి  ఉంటుంది. వదులుకోవడం కరెక్ట్ కాదు.

దీని గురించి సరైన స్పష్టత రావాలంటే ఇంకొంత కాలం ఆగాలి. ఎక్కువ బాలీవుడ్ సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చే నానా పాటేకర్ చాలా అరుదుగా సౌత్ లో కనిపిస్తారు. అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం అర్జున్ రానాలో నటించాక రజనీకాంత్ కాలాలో మెయిన్ విలన్ గా దర్శనమిచ్చాడు. ఇప్పుడు జక్కన్న మూవీలో చేసి ఉంటే మరో మైలురాయి తోడయ్యేది. ఇదంతా అధికారికంగా బయటికి వచ్చింది కాదు కాబట్టి నిజమో కాదో నిర్ధారణ కావాలంటే ఏదో ఒక మీడియా మీట్ లో నానాజీ దొరకాలి. ఈయన సంగతి ఎలా ఉన్నా మాధవన్ ఒక ముఖ్యమైన పాత్ర కోసం లాకయ్యాడని ఫ్రెష్ అప్డేట్. ఇది కూడా లీకుల రూపంలో వచ్చిందే.

This post was last modified on June 8, 2025 5:47 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

21 minutes ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

4 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

9 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

10 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

10 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

11 hours ago