యువ కథానాయకుడు నితిన్‌కు చాలా కాలంగా బాక్సాఫీస్ దగ్గర అస్సలు కలిసి రావడం లేదు. ఎప్పుడో 2020లో వచ్చిన ‘భీష్మ’ తన చివరి హిట్. ఆ తర్వాత నితిన్ నుంచి అరజడను సినిమాలొచ్చాయి. వాటిలో ఏదీ విజయవంతం కాలేదు. లేటెస్ట్‌గా ‘రాబిన్ హుడ్’ చిత్రంతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు నితిన్. అతడి సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌కు కూడా వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. నితిన్ హీరోగా ఈ సంస్థలో నిర్మించిన ‘మాచర్ల నియోజకవర్గం’; ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. తాజాగా ఆ సంస్థ ఓ పెద్ద తమిళ చిత్రాన్ని తెలుగులో పంపిణీ చేసింది. ఆ చిత్రమే.. థగ్ లైఫ్.
ఇంతకుముందు కమల్ హాసన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘విక్రమ్’ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలు అందుకున్నాడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. ఆ ఉత్సాహంలో కమల్ సొంత చిత్రమైన ‘థగ్ లైఫ్’ తెలుగు హక్కులను భారీ రేటుకు కొని తెలుగులో రిలీజ్ చేశారు. ఇది మణిరత్నం డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో తెలుగులో మంచి బజ్‌యే క్రియేట్ అయింది. ఇటీవలి బాక్సాఫీస్ స్లంప్ కారణంగానో ఏమో.. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా కనిపించలేదు. అయినా టాక్ బాగుంటే సినిమా పుంజుకుంటుందని ఆశించారు.
కానీ ‘థగ్ లైఫ్’ కు బ్యాడ్ టాక్ రావడంతో సినిమా తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. మ్యాట్నీల నుంచే జనం పలుచబడిపోయారు. తొలి రోజు ‘థగ్ లైఫ్’ తెలుగులో కోటి రూపాయల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా తెలుగు హక్కులను నితిన్ తండ్రి రూ.18 కోట్లకు తీసుకోవడం గమనార్హం. అందులో పదో వంతు కూడా తొలి రోజు వసూలు కాలేదు. వీకెండ్ వసూళ్లే అత్యంత కీలకం కాగా.. సినిమా అప్పుడే డౌన్ అయిపోయింది. దీంతో ఫుల్ రన్లో పెట్టుబడిలో నాలుగో వంతు అయినా వస్తుందా అన్నది సందేహంగా మారింది. అసలే నితిన్‌కు హీరోగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న సమయంలో ఇది తన కుటుంబానికి పెద్ద షాకే.
This post was last modified on June 7, 2025 6:02 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…