మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దృశ్యం-2ను సెప్టెంబరు చివరి వారంలో మొదలుపెట్టి నవంబరు తొలి వారానికి పూర్తి చేసి సంచలనం సృష్టించాడు దర్శకుడు జీతు జోసెఫ్. కరోనా టైంలో ఇంత పెద్ద సినిమాను ఇంత త్వరగా పూర్తి చేయడం అనూహ్యమే. ఇప్పుడు మరో పేరున్న సినిమాను మొదలుపెట్టిన రెండు నెలల్లోపే ముగించేశారు.
ఆ చిత్రమే.. గమనం. శ్రియ సరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబరు రెండో వారంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అప్పుడే చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. రెండు నెలలు తిరక్కుండానే సినిమాను పూర్తి చేయడమే కాదు.. ట్రైలర్ కూడా రెడీ చేసేయడం విశేషం.
ఈ సినిమా ట్రైలర్‌ను నవంబరు 11న ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా విడుదల కానుండటం విశేషం. కన్నడ, తమిళం, హిందీ, మలయాళం ట్రైలర్లు వరుసగా శివరాజ్ కుమార్, జయం రవి, సోనూ సూద్, ఫాహద్ ఫాజిల్ రిలీజ్ చేయబోతున్నారు.
సుజనా రావు అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రియదే లీడ్ రోల్. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ‘గమనం’కు ఛాయాగ్రహణం సమకూర్చడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించనున్నాడు. స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందించాడు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలు పోషించారీ చిత్రంలో.
This post was last modified on November 10, 2020 9:21 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…