స్ట్రెయిట్ సినిమాలు చేయకపోయినా తెలుగు ప్రేక్షకులకు శింబు సుపరిచితుడే. మన్మథ లాంటి బ్లాక్ బస్టర్స్ తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత చాలా డబ్బింగ్ మూవీస్ వచ్చాయి కానీ ఒకటి రెండు తప్ప పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అయితే గాయకుడిగా మంచు మనోజ్ నుంచి పవన్ కళ్యాణ్ దాకా కొందరు హీరోలకు పాటలు పాడటం వల్ల టాలీవుడ్ జనాలకు కనెక్ట్ అవుతూ వస్తున్నాడు. ఇటీవలే విడుదలైన థగ్ లైఫ్ లో మొదట ఆ పాత్రకు మణిరత్నం తీసుకున్నది దుల్కర్ సల్మాన్ ని. కానీ ఏవో కారణాల వల్ల కొంత కాలం తర్వాత ఆ ఛాన్స్ శింబుని వరించింది. ఫలితం ఏమయ్యిందో చూస్తున్నాం.
తాజాగా సూర్య డ్రాప్ చేసుకున్న వాడివాసల్ దర్శకుడు వెట్రిమారన్ తో చేతులు కలిపేందుకు శింబు నిర్ణయించుకున్నట్టు వస్తున్న చెన్నై రిపోర్ట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకరు వద్దనుకున్న వాటిని ఏరికోరి మరీ తీసుకుంటున్న శింబుకు ఫలితాలు రివర్స్ లో వస్తున్నాయి. వెట్రిమారన్ కు సూర్య నో చెప్పడానికి కారణాలున్నాయి. కథ ఎంత బాగా నచ్చినా, విపరీతంగా ప్రేమించినా రెండేళ్లకు పైగా షూటింగ్ టైం అడగటంతో అంత ఇవ్వలేక వద్దనుకున్నాడని కోలీవుడ్ టాక్. విడుదల పార్ట్ 1, 2 కోసం విజయ్ సేతుపతి తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా నెలల తరబడి కాల్ షీట్లు ఇవ్వాల్సి వచ్చింది. సూర్యకు అలా సాధ్యం కాదు.
మరి శింబు వెట్రిమారన్ తో తెలియక చేస్తున్నా తెలిసి చేస్తున్నా కల్ట్ డైరెక్టర్లతో అతని ప్రయాణం హిట్లను ఇవ్వలేకపోతోంది. థగ్ లైఫ్ చాలా కాస్ట్లీ మిస్టేక్ గా అభిమానులు భావిస్తున్నారు. ఇంత ఇమేజ్ ఉండి అర్థం పర్థం లేకుండా చనిపోయే క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నావని నిలదీస్తున్నారు. మణిరత్నం డైరెక్షన్లో నటించే అదృష్టం నవాబ్ తో తీరిపోయింది కాబట్టి థగ్ లైఫ్ కి నో చెప్పి ఉండాల్సిందనేది వాళ్ళ అభిప్రాయం. ఇదంతా ఏమో కానీ ఓజిలో తమన్ స్వరకల్పనలో ఒక పాట పాడిన శింబు దాని గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. అదెలా ఉండబోతోందోనని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 6, 2025 10:17 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…