Movie News

మణిరత్నం తొలిసారి ఆ ఫీలింగ్ కలిగించాడు

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 38 ఏళ్ల కిందటే ‘నాయకన్’ లాంటి ఆల్ టైం క్లాసిక్ అందించిన దర్శకుడాయన. ఆ తర్వాత రోజా, బొంబాయి, సఖి, ఇద్దరు, యువ.. ఇలా ఎన్నో ఆణిముత్యాలను అందించిన ఘనుడాయన. ఐతే ఎలాంటి దర్శకుడికైనా ఒక దశ దాటాక పరాజయాలు రావడం సహజం. మణిరత్నం కూడా అందుకు మినహాయింపు కాలేకపోయారు. రావణ్, కడలి, చెలియా లాంటి చిత్రాలు ఆయనకు చేదు అనుభవం మిగిల్చాయి. ఐతే మణిరత్నం ఫ్లాప్ సినిమాలు తీస్తే తీసి ఉండొచ్చు కానీ.. ఆ చిత్రాలు ఏవీ ఆయన ఔట్ డేట్ అయిపోయాడు అనే ఫీలింగ్ మాత్రం కలిగించని మాట వాస్తవం.

‘చెలియా’ సినిమా పరమ బోరింగ్‌గా అనిపించినా.. దాన్ని ట్రెండీగానే తీశారు మణిరత్నం. ఇదేం ముతక కథ.. ఇవేం రొటీన్ సన్నివేశాలు అనిపించలేదు. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా అలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఇన్నేళ్ల కెరీర్లో మణిరత్నం ఔట్ డేట్ అయిపోయాడు అని ఆయన అభిమానులకు ఫస్ట్ టైం ఒక ఫీలింగ్ కలిగించిన సినిమా బహుశా ‘థగ్ లైఫ్’యేనేమో. తాను తీసిన ఫ్లాప్ సినిమాలతో కూడా గౌరవం సంపాదించుకున్న దర్శకుడాయన.

కొన్ని ఎపిసోడ్లలో అయినా మెరుపులు మెరిపించేవారు. కానీ ‘థగ్ లైఫ్’ మాత్రం అందుకు మినహాయింపు. ట్రైలర్ చూస్తే భలేగా అనిపించింది కానీ.. సినిమాగా మాత్రం ఇది తీవ్రంగా నిరాశపరిచింది. ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో సార్లు చూసి.. అరిగిపోయిన రొటీన్ గ్యాంగ్ స్టర్‌ డ్రామా కథను ఎంచుకుని.. దాన్ని అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో నడిపించి తన అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు మణిరత్నం. ముఖ్యంగా సెకండాఫ్ చూస్తుంటే చాలామందికి ‘ఇండియన్-2’ గుర్తుకొచ్చింది. ఇంత రొటీన్‌గా, బోరింగ్‌గా సీన్లు ఎలా తీయగలిగారు అని ఆశ్చర్యం కలిగించింది. పూర్తిగా ఔట్ ఆఫ్ ఆర్డర్ అనిపించారు మణిరత్నం. దీంతో ఫ్యాన్స్ సైతం ఇక ఆయన సినిమాలు మానేస్తే మంచిదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

This post was last modified on June 6, 2025 6:37 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

2 hours ago

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

4 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

5 hours ago

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

6 hours ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

8 hours ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

8 hours ago