Movie News

నువ్వు నిజంగా లక్కీవయ్యా దుల్కర్

తండ్రి మమ్ముట్టిలా వేగంగా సినిమాలు చేయకపోయినా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న దుల్కర్ సల్మాన్ దానికి తగ్గట్టే గొప్ప ఫలితాలు అందుకుంటున్నాడు. తెలుగులో చేసిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం దగ్గుబాటి రానా నిర్మాణంలో ఉన్న కాంతా మీద ఇన్ సైడ్ టాక్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. అయితే హఠాత్తుగా దుల్కర్ ని లక్కీ అనేందుకు కారణాలున్నాయి. ఇవాళ విడుదలైన థగ్ లైఫ్ మీద ఎలాంటి టాక్ నడుస్తోందో చూస్తున్నాం. డివైడ్ వచ్చినా ఏదో అనుకోవచ్చు కానీ అత్యధిక శాతం స్పందనలు ప్రతికూలంగా ఉన్నాయి.

స్క్రిప్ట్ రాసుకున్న స్టేజిలో శింబు కన్నా ముందు మణిరత్నం ఎంచుకున్న ఆర్టిస్ట్ దుల్కర్ సల్మానే. అప్పట్లో మీడియా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అదే సమయంలో లక్కీ భాస్కర్ ఒప్పుకున్న దుల్కర్ థగ్ లైఫ్ కు సరిపడా డేట్లు ఇవ్వలేని నిస్సహాయతతో నో చెప్పేసాడు. కానీ మల్లువుడ్ టాక్ ప్రకారం ఆ పాత్రలో బలం లేదని తెలిసే తప్పుకున్నాడని అంటారు. ఎలాగూ మణిరత్నం డైరెక్షన్లో నటించే అదృష్టం ఓకే బంగారంతో తీరిపోయింది కాబట్టి మళ్ళీ నెరవేర్చుకునే ఉద్దేశం లేదు. దీంతో అన్ని కోణాల్లో అలోచించి థగ్ లైఫ్ ని దుల్కర్ సల్మాన్ స్కిప్ కొట్టడం చాలా మంచిదయ్యిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఎందుకంటే శింబు క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన విధానం ఏ మాత్రం పండలేదు సరికదా దానికిచ్చిన నెగటివ్ ట్విస్ట్ తెరమీద పేలలేదు. పైగా హీరోయిన్ లేకుండా త్రిష పాత్రతో ముడిపెట్టడం ఫ్యామిలీ ప్రేక్షకులు ఏ మాత్రం జీర్ణించుకునేలా లేదు. ఒకవేళ చేసి ఉంటే దీని వల్ల దుల్కర్ కు వచ్చే నష్టమే తప్ప లాభం లేదు. అందుకే స్మూత్ గా మిస్ చేసుకున్నాడు. థగ్ లైఫ్ లో కమల్ హాసన్ కు తప్ప ఇంకెవరికి సరైన ప్రాధాన్యం దక్కలేదు. జోజూ జార్జ్, నాజర్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు సైతం వృథా అయ్యారు. లక్కీ భాస్కర్ కోసమో మరింకేదైనా కారణమో చెప్పలేం కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం నిజంగా లక్కీనే.

This post was last modified on June 5, 2025 5:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

16 minutes ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

2 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

2 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

3 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

3 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

3 hours ago