Movie News

భైరవం ఎదురీతకు ఇంకొక్క ఛాన్స్

ముగ్గురు హీరోలకు కంబ్యాక్ ఇస్తుందని భావించిన భైరవం ఆశించిన స్థాయిలో దూకుడు చూపించలేకపోతున్న వైనం వసూళ్లలో కనిపిస్తోంది. మొదటి రెండు రోజుల ఖలేజా రీ రిలీజ్ వల్ల ప్రభావితం చెందినప్పటికీ తర్వాతైనా పికప్ చూపించాల్సింది. అయితే యునానిమస్ టాక్ రాకపోవడం కలెక్షన్లను ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు ఐపీఎల్ క్వాలిఫయ్యర్, ఫైనల్ మ్యాచులు వీకెండ్ తో పాటు వీక్ డేస్ సాయంత్రం, సెకండ్ షోల మీద దెబ్బ కొట్టాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం భైరవం టార్గెట్ గ్రాస్ ముప్పై కోట్ల దాకా ఉంది. కానీ మొదటి వారం పూర్తయ్యే సమయానికి పది కోట్ల మార్కునే చేరుకుందని అంటున్నారు.

అంటే లక్ష్యం ఇంకా పెద్దదే ఉంది. కంటెంట్ పరంగా మాస్ అంశాలు ఉన్నప్పటికీ గరుడన్ ని యధాతథంగా తీయడం, అవసరం లేని కామెడీని ఫస్ట్ హాఫ్ లో జొప్పించడం, మంచు మనోజ్ బాగా నటించినా అతను విలన్ కావడం, హీరోయిన్ అదితి శంకర్ మైనస్ కావడం లాంటి కారణాలు పబ్లిక్ టాక్ ని ఎఫెక్ట్ చేశాయి. ఇలాంటి సినిమాలు రెండో రోజుకే టాక్ లో మార్పు చూపించాలి. లేకపోతే లేవడం కష్టం. నిజానికి థియేటర్లలో చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేదు. భైరవం కనక బాగుందని  అనిపించుకుని ఉంటే ఇవాళ లెక్కలు వేరుగా ఉండేవి. ఒక రకంగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టేనని ఫిగర్లు చెబుతున్న వాస్తవం.

రేపు థగ్ లైఫ్ తో పాటు బద్మాష్ లాంటి మరికొన్ని చిన్న సినిమాలు బరిలో దిగుతున్నాయి. అన్నీ టాక్ మీద ఆధారపడినవే. కమల్ హాసన్ మణిరత్నం కలయిక మన ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడం లేదు. సో ఓపెనింగ్స్ మరీ భారీగా రాకపోవచ్చు. సో భైరవం కనక సెకండ్ వీక్ లో పుంజుకుంటే బ్రేక్ ఈవెన్ ఛాన్సులు కొంత మేర పెరుగుతాయి. కానీ అంత గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. ప్రమోషన్లు అయితే కొనసాగిస్తున్నారు. అల్లుడు అదుర్స్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటన పరంగా ఓకే కానీ రిజల్ట్ పరంగా మాత్రం తాను ఆశించిన అద్భుతం జరగడం అనుమానమే.

This post was last modified on June 5, 2025 12:56 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్రాంతి సినిమాలకు కొత్త సంకటం

ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…

43 minutes ago

తమన్ చెప్పింది రైటే… కానీ కాదు

అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…

2 hours ago

అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్

ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…

2 hours ago

రెండో విడతలోనూ హస్తం పార్టీదే హవా!

తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్…

4 hours ago

కేసీఆర్ హరీష్‌తో జాగ్రత్త!: మహేష్ కుమార్

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…

5 hours ago

మనసు మార్చుకుంటున్న దురంధర్ 2

రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…

5 hours ago