సుర్వీన్ చావ్లా.. దగ్గుబాటి రానా లీడ్ రోల్ చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబయి భామ. హిందీలో ఆమె పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో కూడా ఓ సినిమా చేసింది. ‘హేట్ స్టోరీ-2’ లాంటి బోల్డ్ సినిమాల్లో నటించి మెప్పించిన సుర్వీన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. ఆమె తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఈ ఇంటర్వ్యూలో పంచుకుంది. తమిళ పరిశ్రమకు చెందిన ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్.. తనతో పడుకోవాలని ఒక మధ్యవర్తి ద్వారా గట్టిగా ఒత్తిడి తెచ్చినట్లు ఆమె వెల్లడించింది.
ఆ దర్శకుడు చేయాల్సిన ఒక సినిమా కోసం తాను ఆడిషన్ ఇచ్చానని.. అది పూర్తయ్యాక తన పెర్ఫామెన్స్ సూపర్ అని అతను కితాబిచ్చాడని.. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలపై తాము మాట్లాడుకున్నామని.. ఈ సినిమాలో నటించడం కోసం ఎదురు చూస్తుండగా ఆ దర్శకుడు రూటు మార్చాడని సుర్వీన్ వెల్లడించింది. ఆయనకు సన్నిహితుడైన ఒక మధ్యవర్తి తనకు కాల్ చేసి.. తన పెర్ఫామెన్స్ దర్శకుడికి నచ్చిందని చెబుతూ, తనను కూడా ఆయన ఇష్టపడుతున్నాడంటూ అదో రకంగా మాట్లాడాడని సుర్వీన్ వెల్లడించింది.
కొంతసేపటికి తనకు విషయం అర్థమై అతను నాతో పడుకోవాలనుకుంటున్నాడా అని అడిగానని ఆమె చెప్పింది. తాను ఆ టైపు కాదని, అందుకు అంగీకరించేవాళ్లను చూసుకోవాలని ఓపెన్‌గా చెప్పేశానని సుర్వీన్ వెల్లడించింది. అయినా ఆ వ్యక్తి తనను వదలకుండా మళ్లీ మళ్లీ కాల్ చేస్తూనే ఉన్నాడని.. తాను మాత్రం లొంగలేదని ఆమె చెప్పింది. ఈ సినిమాలో ఒక జాతీయ అవార్డు గెలిచిన ఆర్టిస్టు కూడా భాగమని సుర్వీన్ తెలిపింది. మరోవైపు తనకు కొత్తగా పెళ్లయిందని తెలిసి కూడా ఒక దర్శకుడు అతడి ఆఫీస్ కేబిన్లో ముద్దు పెట్టుకోవాలని చూసినట్లు ఆమె మరో అనుభవం గురించి వెల్లడించింది. తన మ్యారీడ్ లైఫ్ గురించి, భర్త గురించి క్యాజువల్‌గా అడిగిన కాసేపటికే.. అతను తనకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించగా, తాను అతణ్ని తోసేశానని ఆమె చెప్పింది.
This post was last modified on June 1, 2025 12:52 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…