Movie News

విజయం కోసం విజయేంద్రుడి సాయం ?

ఇటీవలే దర్శకుడు పూరి జగన్నాథ్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ని కలిసి ఫోటోలు తీసుకోవడం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి మాట్లాడుతూ లైగర్ తర్వాత విజయేంద్రప్రసాద్  ఫోన్ చేసి నెక్స్ట్ సినిమా కథ ముందే చెప్పమని అడిగారని. తనకు ఫెయిల్యూర్స్ రావడం ఇష్టం లేక అలా కోరుకోవడం చూసి ఎమోషనలయ్యానని అన్నారు. కానీ పూరి వెళ్లి స్టోరీ చెప్పలేదు. భయపడినట్టుగానే సినిమా డిజాస్టరయ్యింది. విజయేంద్ర ప్రసాద్ ని కలిస్తే ఆయన అనుభవం సలహాల రూపంలో దక్కి మరింత మెరుగైన స్క్రిప్ట్ అయ్యేదని జనాలు ప్రశ్నించారు. ఇవన్నీ విన్నారు కాబోలు పూరి ఆ పనే చేశారు.

విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించబోయే ప్యాన్ ఇండియా మూవీకి స్టోరీ పరంగా విజయేంద్ర ప్రసాద్ సలహాలు ఇచ్చారని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. రాజమౌళి సక్సెస్ వెనుక ఒక తండ్రిగా కన్నా ఒక రైటర్ గా ఆయన అనుభవం ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు పూరికి గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా మంచి పరిణామమే. సాధారణంగా పూరి బయట రచయితల కథలు, మార్పులు తీసుకోరు. ఒక్క టెంపర్ కి మాత్రం వక్కంతం వంశీ రాసిన సబ్జెక్టుని ఓకే చేశారు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ వల్లేననేది ఓపెన్ ఫ్యాక్ట్. సినిమా పెద్ద హిట్టయ్యింది.

ఇప్పుడు పూరి జగన్నాథ్ కు నిజంగా విజయేంద్ర ప్రసాద్ మాట ప్లస్ రాత సాయం చేసి ఉంటే బాగా ప్లస్ అవుతుంది. క్యాస్టింగ్ దగ్గరి నుంచి షెడ్యూలింగ్ దాకా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటున్న పూరి ఈసారి బలమైన కంబ్యాక్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. విలన్ గా దునియా విజయ్ తో పాటు టబు అఫీషియల్ క్యాస్టింగ్ లో చేరిపోయారు. నివేదా థామస్ ఆల్మోస్ట్ ఓకే అయినట్టే. రాధికా ఆప్టే తానీ మూవీలో లేనని తేల్చి చెప్పేసింది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ సినిమాకు త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోగా రిలీజ్ చేయాలనేది టార్గెట్. పూరి వేగానికి ఇదేమంత కష్టం కాదు.

This post was last modified on June 1, 2025 12:48 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

1 hour ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

1 hour ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

2 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

3 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

4 hours ago

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

6 hours ago