టాలీవుడ్లో ఇప్పుడు విలన్ పాత్ర అంటే ముందుగా కనిపించే ఛాయిస్ జగపతిబాబే. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. మధ్యలో ఫామ్ కోల్పోయి కొంత కాలం లైమ్ లైట్లో లేకుండా పోయారు కానీ.. ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాక ఆయన దశ తిరిగిపోయింది. ఇక అప్పట్నుంచి స్టైలిష్ విలన్ పాత్రలతో చెలరేగిపోయారు. మధ్య మధ్యలో కొన్ని పాజిటివ్ పాత్రలు వేసినప్పటికీ.. జగపతి ఎక్కువగా పాపులర్ అయింది మాత్రం విలన్ పాత్రలతోనే.
మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ల సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు చేశారు. ఐతే ఈ మధ్య కొంచెం స్థాయి తగ్గించుకుని ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ జగపతి విలన్ పాత్ర పోషించారు. ఆ చిత్రమే.. మిస్ ఇండియా.
‘మహానటి’తో కీర్తి ఇమేజ్ అమాంతం పెరిగిపోవడంతో ఆమె సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ముందుకొచ్చారు జగపతి. కానీ ఈ సినిమా ఒప్పుకునే సమయానికి కీర్తికి ఉన్నంత సీన్ రిలీజయ్యే సమయానికి లేదు. ఆమె ఇమేజ్ దెబ్బ తింది. వరుస పరాజయాలు ఆమె రేంజ్ తగ్గించేశాయి. ‘మిస్ ఇండియా’ సినిమాతో ఆమె మరింత కిందికి పడింది. ఈ చిత్రంలో జగపతి విలనీ చేయబోతే అది కాస్తా కామెడీ అయిపోయింది. సినిమాకు ఆయన పాత్ర పెద్ద మైనస్ అయింది.
విశేషం ఏంటంటే.. ‘మిస్ ఇండియా’లో కీర్తికి విలన్‌గా నటించిన జగపతి.. ఆమె తర్వాతి సినిమాలో తన కోచ్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఆ సినిమానే.. గుడ్ లక్ సఖి. ఇందులో కీర్తి మారు మూల ప్రాంతానికి చెందిన గిరిజన యువతి పాత్రలో నటించనుంది. ఆ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఆర్చర్‌గా ఆమె ఎలా ఎదిగిందన్నది ఈ సినిమా కథ. ఆ యువతికి శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే స్ఫూర్తిదాయక కోచ్ పాత్రలో జగపతి నటించాడు. ఇలా వరుసగా రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒక నటుడు విలన్‌గా, కోచ్‌గా నటించడం అరుదైన విషయమే. మరి విలన్‌గా తుస్సుమన్న జగపతి.. కోచ్‌గా ఆమెకెలాంటి ఫలితాన్నందిస్తాడో చూడాలి.
This post was last modified on November 8, 2020 6:41 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…