రీఎంట్రీలో మాంచి జోరుమీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటికి ఐదు సినిమాలు లైన్లో పెట్టాడు. ఈ మధ్యే దసరా కానుకగా పవన్ కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల దర్శకుడు సాగర్.కె.చంద్ర రూపొందించనున్నాడు.
కాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా ఈ మధ్య గట్టి ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజమా కాదా అన్నది ఖరారవ్వలేదు కానీ.. ఈ సినిమాకు ఆ టైటిల్ ఎంతమాత్రం బాగుండదన్నది మెజారిటీ మాట. ఇంతకుముందు చిరంజీవి, మోహన్ బాబు నటించిన మల్టీస్టారర్ మూవీకి ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెట్టారు. అది మూడున్నర దశాబ్దాల కిందటి చిత్రం. ఆ సమయానికి ఆ టైటిల్ బాగానే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పేర్లు బాగా పాతబడిపోయాయి.
పైగా ‘అయ్యప్పనుం కోషీయుం’ కథ, అందులోని పాత్రల్ని బట్టి చూసినా ఈ టైటిల్ ఆ సినిమాకు సూటవ్వదు. పవన్ చేయబోయేది సీరియస్ పోలీస్ పాత్ర. ఇందులో మరో పాత్ర సైతం సీరియస్‌గానే ఉంటుంది. ఇద్దరూ ఉన్నత స్థాయి వ్యక్తుల్లా కనిపిస్తారు. అలాంటి పాత్రకు బిల్లా, రంగా అని పేర్లు పెట్టి సినిమాకు ఆ టైటిల్ పెడితే ఏమీ బాగుండదు. ఈ మాత్రం అవగాహన దర్శక నిర్మాతలకు లేకుండా ఉండదు. కాబట్టి ఈ చిత్రానికి ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం ఇక కట్టిపెట్టేస్తే మంచిది. నిజానికి ఈ టైటిల్‌తో మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ చేయాలన్నది ప్లాన్. ఆ ఇద్దరూ ఆ దిశగా ఆసక్తి వ్యక్తం చేశారు కూడా. కాబట్టి వాళ్లకే ఆ టైటిల్ ఇచ్చేసి వేరే వాళ్లు దాని జోలికి వెళ్లకపోతే మంచిది.
This post was last modified on November 8, 2020 3:08 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…