ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న థగ్ లైఫ్ కు సంబంధించిన కర్ణాటక వివాదం అంత సులభంగా చల్లారేలా లేదు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటూ కమల్ హసన్ తెగేసి చెప్పడం, దానికి స్పందనగా కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ సినిమాను బ్యాన్ చేస్తున్నామని చెప్పడం నిన్న జరిగిపోయాయి. ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొందరు థగ్ లైఫ్ బెంగళూరులో ఫలానా థియేటర్లో రిలీజవుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కొత్త చర్చకు దారి తెస్తోంది. అయినా మండలి నిర్ణయాన్ని ధిక్కరించి వీళ్ళు అంత సాహసం చేయలేరు కానీ మొత్తానికీ కాంట్రావర్సి రకరకాల మలుపులు తిరుగుతోంది.
ఒకవైపు కమల్ కు మద్దతుగా కోలీవుడ్ నడిగర్ సంఘం పబ్లిక్ ప్రెస్ నోట్ ఒకటి వదిలింది. అటు కర్ణాటక అధికార పార్టీ మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, శాండల్ వుడ్ పెద్దలు ముక్త కంఠంతో కమల్ క్షమాపణ చెప్పాల్సిందేనని భీష్మించుకుని ఉన్నాయి. ఈ గొడవ వల్ల మంచివాడిగా పేరున్న శివరాజ్ కుమార్ సైతం ఈ ఇష్యూలో నలిగిపోవడం ఫ్యాన్స్ ని బాధిస్తోంది. థగ్ లైఫ్ ఈవెంట్ కు గెస్టుగా వెళ్లడం వల్లే శివన్నకు ట్రోలింగ్ బారిన పడే దుస్థితి కలిగిందని వాపోతున్నారు. ఇది చూసైనా తనను అంత అభిమానించే శివరాజ్ కుమార్ కోసం సారీ చెప్పమని కమల్ ని వివిధ రూపాల్లో డిమాండ్ చేస్తున్నారు. శివన్న తండ్రి రాజ్ కుమార్ తో కమల్ అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు.
థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ కాకపోయినా పర్వాలేదని కమల్ ఇప్పుడు అనుకోవచ్చు. కానీ దీని ప్రభావం ఇతరత్రా రూపాల్లో కూడా ఉంటుంది. కన్నడ తమిళం నుంచి పుట్టిందనే మాటకు ఆయన వద్ద ఆధారం లేనప్పుడు హుందాగా క్షమాపణ చెబితే అయిపోతుందనేది భాషా ప్రేమికుల వాదన. నేనేం తప్పు చేయలేదనేది కమల్ కౌంటర్. చేతిలో చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కన్నడ బయ్యర్లు వర్రీ అవుతున్నారు. తమ డబ్బులు వెనక్కు రావడం కన్నా సినిమా రిలీజ్ కావడమే కోరుకుంటున్నామని, కమల్ అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. చూడాలి ఇది ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో.
This post was last modified on May 31, 2025 1:20 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…