నిన్న భైరవం పెద్ద ఎత్తున విడుదలయ్యింది. ఖలేజా రీ రిలీజ్ వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందినప్పటికీ మెల్లగా టాక్ ఊపందుకుని వీకెండ్ కంతా వసూళ్లు పెరుగుతాయనే నమ్మకంతో టీమ్ ఉంది. ఇది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కంబ్యాక్ అయినా అధిక శాతం ప్రేక్షకులకు దీని మీద ఆసక్తి కలగడానికి కారణం మంచు మనోజ్. తను ఫుల్ లెన్త్ రోల్ లో చివరిసారి కనిపించింది 2017లో. ఒక్కడు మిగిలాడు తర్వాత మాయమైపోయాడు. తర్వాత ఓ రెండు క్యామియోలు చేసినా జనాలకు రీచవ్వలేదు. మొత్తంగా తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడీ భైరవం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.
నెగటివ్ టచ్ ఉన్న గజపతి పాత్రలో ,మంచు మనోజ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేశాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో గొంతును మరీ గంభీరంగా పెట్టి అరిచినట్టు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే తన క్యారెక్టర్ వరకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా నారా రోహిత్ తో తన కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి. నెక్స్ట్ మిరాయ్ లో కూడా మనోజ్ విలన్ గానే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన టీజర్ లో క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు కనక బాగా క్లిక్ అయితే మనోజ్ రూపంలో టాలీవుడ్ కో కొత్త విలన్ దొరికినట్టే. అయితే హీరోగానూ తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉండటం గమనించాల్సిన విషయం.
కుటుంబ వివాదంలో తరచు నలుగుతున్న మనోజ్ ఈ మధ్య మంచి జోష్ తో కనిపిస్తున్నాడు. భైరవం ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో అందరితో సరదాగా మాట్లాడుతూ జోకులు పేలుస్తూ వాటిని నిలబెట్టాడు. ఒకపక్క నారా రోహిత్, సాయిశ్రీనివాస్ ఎంత మాట్లాడినా వాళ్ళను డామినేట్ చేసేలా తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. అయితే మనోజ్ ని కేవలం సీరియస్ పాత్రలకు పరిమితం చేయకుండా తనలో ఫన్ ని వాడుకుంటే బిందాస్, దొంగ దొంగది, పోటుగాడు లాంటి కామెడీని పుట్టించవచ్చు. మనోజ్ మాత్రం ఇదే ఫ్లోతో వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తాడో.
This post was last modified on May 31, 2025 8:54 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…