Movie News

పూరి సినిమాలో నేను లేను – స్పందించిన హీరోయిన్

రక్త చరిత్ర, లెజెండ్, లయన్ లాంటి సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన రాధికా ఆప్టేకు బాలీవుడ్ లో బోల్డ్ గర్ల్ గా చాలా పేరుంది. విభిన్నమైన చిత్రాలతో పాటు కంటెంట్ డిమాండ్ చేస్తే అవుట్ అఫ్ ది బాక్స్ షో చేయడానికి వెనుకాడని ఈ భామ కొన్నాళ్లుగా కనిపించడం తగ్గించేసింది. అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్న సిస్టర్ మిడ్ నైట్ ఈ రోజు ఇండియాలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చి ప్రమోషన్లు చేసుకుంటోంది. ఈ మూవీలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని వినిపిస్తున్న నేపథ్యంలో నార్త్ ఆడియన్స్ దీని మీద బాగానే ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి – దర్శకుడు పూరి జగన్నాధ్ కలయికలో రూపొందబోయే బెగ్గర్ (ప్రచారంలో ఉన్న టైటిల్) లో రాధికా ఆప్టే ఉందనే వార్త రెండు నెలల నుంచే చక్కర్లు కొడుతోంది. అయితే టీమ్ దాన్ని సమర్ధిస్తూ ఖండిస్తూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాధికా ఆప్టేకు దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా ఆమె నవ్వేసింది. నేను ఈ వార్త విన్నానని, కానీ పూరి విజయ్ సినిమాలో నేను లేనని కుండబద్దలు కొట్టేసింది. నాకసలు ఈ సంగతే తెలియదని, పత్రికలు సైట్స్ లో చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. సో రాధికా ఆప్టే అఫీషియల్ గా లేనట్టేననే కన్ఫర్మేషన్ వచ్చేసింది.

మరి ఈ గాసిప్ ఎలా పుట్టిందో ఏమో కానీ తన స్థానంలో పూరి ఎవరిని తీసుకుబోతున్నారో చూడాలి. ఇప్పటిదాకా ఖరారైన క్యాస్టింగ్ లో టబు, దునియా విజయ్ ఉన్నారు. నివేదా థామస్ పేరు వినిపిస్తోంది కానీ అధికారికంగా ఇంకా ముద్ర పడలేదు. పెద్ద ఆర్టిస్టులను డిమాండ్ చేసే సబ్జెక్టు కావడంతో పూరికి ఈ ఎంపికలోనే ఎక్కువ సమయం గడిచిపోతోందట. అందుకే ముందు ఏప్రిల్ అనుకున్న రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడు జూన్ లో స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. రెండు డిజాస్టర్ల తర్వాత కంబ్యాక్ అవ్వాలనే లక్ష్యంతో పూరి జగన్నాథ్ ఈ స్క్రిప్ట్ ని చాలా కసితో రాసుకున్నాడని ఇన్ సైడ్ టాక్.

This post was last modified on May 30, 2025 8:29 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago