ఇప్పటికే హైదరాబాద్‌లో పెద్ద పెద్ద స్టూడియోలున్నాయి. అన్నింటికీ మించి రామోజీ ఫిలిం సిటీ గురించి చెప్పడానికి చాలానే ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద సినీ స్టూడియో ఇది. ఏకంగా 1600 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కింది. ఐతే దాన్ని తలదన్నేలా ప్రభుత్వం తరఫున ఫిలిం సిటీ కట్టబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలివ్వడం విశేషం. ఇంతకుముందు కూడా ఆయన ఈ ‘సినిమా సిటీ’ గురించి చెప్పారు. ఐతే సినీ రంగం గురించి తాను మాట్లాడే సందర్భంలోనో.. లేక తనను సినిమా వాళ్లెవరైనా కలిసినప్పుడో సీఎం కేసీఆర్ ఇలాంటి ఘనమైన ప్రకటనలు ఇవ్వడం మామూలే. కేసీఆర్ అనే కాదు.. చాలామంది పాలకులు ఇలాగే వివిధ రంగాల వాళ్లను కలిసినపుడు వారిని ఊరడించేలా ప్రకటనలు చేస్తుంటారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున తదితరులు సినీ రంగం తరఫున వరద సాయం చెక్కులను ఇచ్చేందుకు గాను ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ జనాలు పొంగిపోయే మాటలు చెప్పారు కేసీఆర్. “ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్‌తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది” అంటూ ఘనంగా ప్రకటించారు కేసీఆర్.
ఐతే హైదారాబాద్ చుట్టూ భూమికి ఉన్న డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది 1500-2000 ఎకరాల స్థలాన్ని సినీ పరిశ్రమ కోసం కేటాయించి కొత్తగా ఓ ఫిలిం సిటీని ప్రభుత్వం నిర్మిస్తుందని అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజంగా ఇది కార్యరూపం దాల్చితే అద్భుతమే అనుకోవాలి.
This post was last modified on November 8, 2020 11:15 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…