గద్దర్ అవార్డులు 2024 – వీళ్ళే విజేతలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గద్దర్ 2024 అవార్డుల ప్రకటన వచ్చేసింది. జ్యురీ చైర్ పర్సన్ జయసుధ, ఎఫ్డిసి చైర్ మెన్ దిల్ రాజుతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్న మీడియా సమావేశంలో వీటిని అనౌన్స్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వడం ఆగిపోయాక ఏపీ, తెలంగాణ వైపు నుంచి వీటిని పునరుద్ధరించే ప్రయత్నాలు చాలా సంవత్సరాలు జరగలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ప్రత్యేకంగా కమిటీని వేశారు. వీళ్ళు వివిధ ప్రామాణికాల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. పధ్నాలుగేళ్ల తర్వాత జరగబోతున్న పురస్కారాల వేడుక కావడంతో టాలీవుడ్ దీని పట్ల చాలా ఆసక్తిగా ఉంది. ముందు విన్నర్స్ లిస్టు చూద్దాం.

మొదటి ఉత్తమ చిత్రం – కల్కి 2898 ఏడి
రెండో ఉత్తమ చిత్రం – పొట్టెల్
మూడో ఉత్తమ చిత్రం – లక్కీ భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు
చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ ఫిలిం – రజాకార్
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం – ఐ అండ్ మై ఫ్రెండ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం – ఆయ్
ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు – కమిటీ కుర్రాళ్ళు (యదు వంశీ)

వ్యక్తిగత విభాగంలోని పురస్కారాలు

ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ ( కల్కి 2898 ఏడి)
ఉత్తమ నటుడు – అల్లు అరుణ్ (పుష్ప 2 ది రూల్)
ఉత్తమ నటి – నివేదా థామస్ ( 35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు – ఎస్జె సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి – శరణ్య (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు)
ఉత్తమ సంగీత దర్శకుడు – భీమ్స్ (రజాకార్)
ఉత్తమ నేపధ్య గాయకుడు – సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపధ్య గాయని – శ్రేయ ఘోషల్ (పుష్ప 2)
ఉత్తమ హాస్య నటుడు – సత్య (మత్తువదలరా 2)
ఉత్తమ బాల నటుడు – మాస్టర్ అరుణ్ తేజ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సి కిల్లింగ్)
ఉత్తమ కథ రచయిత – శివ పాలడుగు ( మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ (రాజూ యాదవ్)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు – విశ్వనాథ్ రెడ్డి (గామి)
ఉత్తమ ఎడిటర్ – నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ శబ్దగ్రాహకుడు – అరవింద్ మీనన్ (గామి)
ఉత్తమ నృత్యదర్శకుడు – గణేష్ ఆచార్య (దేవర)
ఉత్తమ కళాదర్శకుడు – నితిన్ జిహాని చౌదరి (కల్కి)
ఉత్తమ పోరాట దర్శకుడు – కె చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శీను (రజాకార్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చనా రావు – అజయ్ కుమార్ (కల్కి 2898 ఏడి)

స్పెషల్ జ్యురి అవార్డులు

హీరో దుల్కర్ సల్మాన్ – లక్కీ భాస్కర్
హీరోయిన్ అనన్య నాగళ్ళ – పొట్టెల్
దర్శకులు సుజిత్ – సందీప్ – క
నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి – రాజేష్ కల్లెపల్లి – రాజూ యాదవ్
స్పెషల్ జ్యురి స్పెషల్ మెన్షన్ – ఫారియా అబ్దుల్లా (మత్తువదలరా 2)
రచయిత రెంటాల జయదేవ్ –  ‘మన సినిమా ఫస్ట్ రీల్’ పుస్తకం

మొత్తం 11 విభాగాల్లో వీటిని ప్రకటించారు. 1248 నామినేషన్లను వడబోసి ఉత్తమమైన వాటిని ఎంచుకున్నారు. 2024 సంవత్సరానికి అన్ని విభాగాల అవార్డులు అనౌన్స్ చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన సినిమాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విజేతలను నిర్ణయించారు. 21 మందికి ప్రత్యేక పురస్కారాలు అందబోతున్నాయి. జూన్ 14 తెలంగాణ రాజకీయ, సినీ అతిరథ మహారధుల మధ్య ఈ వేడుకని హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. వేదిక ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.