Movie News

ఇంకో రిస్కుకి వరుణ్ తేజ్ సిద్ధం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు .తనవరకు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నప్పటికీ విజయం మాత్రం అందని ద్రాక్షగా మారిపోయింది. తొలిప్రేమ, ఫిదా స్థాయి బ్లాక్ బస్టర్ దక్కి సంవత్సరాలు గడిచిపోయాయి. కనీసం గద్దలకొండ గణేష్ లాంటి డీసెంట్ సక్సెస్ దక్కినా కొంత ఊరట దక్కేది. కానీ గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవ ధారి అర్జున, మట్కా ఒకదాన్ని మించి మరొకటి పోవడం ఓపెనింగ్స్ తో పాటు మార్కెట్ ని దెబ్బ తీశాయి. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హారర్ కామెడీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే అనంతపూర్ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుని కొరియా వెళ్లేందుకు రెడీ అవుతోంది. మేర్లపాక గాంధీ ఫామ్ లో లేకపోయినా కథ మీద నమ్మకంతో వరుణ్ తేజ్ దీన్ని చేస్తున్నారు. కొరియన్ కనకరాజు టైటిల్ పరిశీలనలో ఉంది. దీని తర్వాత దర్శకుడు విక్రమ్ సిరికొండకు మెగా ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇతని ట్రాక్ రికార్డు కూడా ఆశాజనకంగా లేదు. 2018లో రవితేజతో టచ్ చేసి చూడు రూపంలో డైరెక్షన్ డెబ్యూ చేసి ఫ్లాప్ రుచి చూశాడు. రచయితగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, మిరపకాయ్, రేస్ గుర్రం లాంటి సూపర్ హిట్స్ కి పని చేసిన అనుభవం ఉంది.

ఏడేళ్లు దర్శకత్వానికి దూరంగా ఉన్న విక్రమ్ సిరికొండ ఈసారి విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథను ఎంచుకున్నట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ దీన్ని తెరకెక్కించనుంది. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జయాపజయాల సంగతి పక్కన పెడితే వరుణ్ తేజ దగ్గరికి పెద్ద బ్యానర్లే వస్తున్నాయి. యూవీ, మైత్రి ఇలా ప్రొడక్షన్ లో రాజీ లేని సంస్థలతో చేతులు కలుపుతున్నాడు. విక్రమ్ చెప్పబోయే కథ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటున్నారు. అది ఎలా ఉండబోతోందో చూడాలి. మరో ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తున్న వరుణ్ తేజ్ ఈ రెండింటితో విజయం అందుకుంటే తిరిగి రేస్ లోకి వచ్చేయొచ్చు.

This post was last modified on May 29, 2025 8:06 am

Share

Recent Posts

ఒక్క వ్యక్తి వల్ల రూ.10,986 కోట్ల మెట్రో ప్రాజెక్టుకు బ్రేక్

నగరాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించి, ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి…

13 minutes ago

డూమ్స్‌డే మీద ఎందుకు ఇంత క్రేజంటే

ఇండియాలో హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేయడం మొదలుపెట్టాక…

26 minutes ago

11 నెలల పసిపాపనూ వదలట్లేదు

దేశంలో చిన్నారుల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం 11 నెలల…

2 hours ago

దిల్ రాజు మాట నిల‌బ‌డుతుందా?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు, స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి ఉన్న అనుబంధం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని…

6 hours ago

రావిపూడి రేంజ్ ఏమిటో అర్థమయ్యిందిగా

తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ బడ్జెట్ లో అత్యధిక రిటర్న్స్ తెచ్చిపెట్టగల దర్శకులు ఎవరయ్యా అంటే టాలీవుడ్ మొత్తం…

11 hours ago

నెల్సన్ తొలి సినిమా ఉన్న లాప్ ట్యాప్ ఎవడో లేపేసాడు

నెల్సన్ దిలీప్ కుమార్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో అతను తీసిన…

12 hours ago